Thursday, May 2, 2024

కెనడాలో విదేశీయులు ఆస్తులు కొనవద్దు..

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: కెనడాలో విదేశీయులు ఆస్తులు కొనడంపై స్థానిక అధికార యంత్రాంగం నిషేధం విధించింది. ఇది ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది. కెనడాలో గృహసముదాయాల కొరత ఉండటంతో విదేశీయుల కొనుగోళ్లపై నిషేధం విధించారు. స్థానికులకు ఎక్కువగా ఇళ్లు అందుబాటులోకి వచ్చేందుకు ఈ వెసులుబాట్లతో కూడిన నిషేధ చట్టం అమలులోకి వచ్చింది. ఈ రాయితీల మేరకు శరణార్థులు, శాశ్వత నివాసులు అయి ఉండి దేశ పౌరులు కాని వారు ఇళ్లను ఆస్తులను కొనుగోలు చేయవచ్చు.

అయితే నగరాలలోని ఇళ్లు స్థలాలపై నిషేధం ఉంటుంది. తప్పితే వేసవి విడిది బసలు, ఇతరత్రా వినోదక పర్యాటక స్థలాలో ఆస్తుల కొనుగోళ్లపై నిషేధం వర్తించదని డిసెంబర్‌లోనే వివరణ ఇచ్చారు. తాత్కాలికంగా రెండేళ్ల పాటు విదేశీయులకు స్థలాలు విక్రయించరాదనే నిబంధనను తీసుకువస్తామని దేశ ప్రధాని జస్టిన్ ట్రూడియో ప్రతిపాదించారు. విదేశీయులు ప్రత్యేకించి భారతీయులు ఎక్కువగా ప్లాట్లను కొనుక్కోవడంతో స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో వీటితో పోటీపడి స్థానికులు సొంత ఇళ్లు కొనుక్కునే పరిస్థితి లేదనే విమర్శలతో తమ ఎన్నికల ప్రచారంలో జస్టిన్ విదేశీయులపై స్థలాల కొనుగోళ్ల నిషేధం తీసుకువస్తామని ప్రకటించి, ఈ నిబంధనలకు కొన్ని సడలింపులు జతపర్చి అమలులోకి తీసుకువచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News