Tuesday, October 15, 2024

జూబ్లీహిల్స్‌లో గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

గంజాయి తరలిస్తున్న ఇద్దరిని జూబ్లీహిల్స్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 8.60కిలోల గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…బీహార్ రాష్ట్రానికి చెందిన చామన్ కుమార్, సాయినాథ్, రోహన్ కుమార్ కలిసి గంజాయి దందా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహన్‌కుమార్‌కు గంజాయిని డెలివరీ చేసేందుకు చామన్‌కుమార్, సాయినాథ్ బైక్‌పై బయలుదేరారు. ఇద్దరు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10 గుండా వెళ్తుండగా ఈ సమాచారం ఎక్సైజ్ సిబ్బందికి తెలిసింది.

వెంటనే వారిని గుర్తించి రోడ్డునంబర్ 10వద్ద ఆపి తనిఖీలు చేయగా గంజాయి లభించింది. వారిని విచారించగా రోహన్ కుమార్‌కు ఇచ్చేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రోహన్ కుమార్ పరారీలో ఉన్నారు. గంజాయిని పట్టుకున్న వారిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ చంద్రశేఖర్, ఎస్సై శ్రీనివాస్, జూబ్లీహిల్స్ ఎక్సైజ్ సీఐ వాసుదేవరావు, ఎస్సై బ్రహ్మచార్యులతో పాటు సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News