Sunday, May 19, 2024

9వ విడత జిఎస్టి పరిహారం విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: జీఎస్టీ పరిహారం కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. తొమ్మిదవ విడతగా రూ.6వేలకోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.5,516.60కోట్లు రాష్ట్రాలకు, రూ.483.40కోట్లు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసింది. స్పెషల్ బారోయింగ్ ప్లాన్‌లో భాగంగా కేంద్ర ఆర్ధికశాఖ నుంచి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఇప్పటివరకూ రూ.54వేలకోట్లు అందించినట్టయింది. జీఎస్టీ విధానం వల్ల పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసింది.స్పెషల్ బారోయింగ్ ప్లాన్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.818.16కోట్లు విడుదలయ్యాయి.

Central Govt released 9th installment GST compensation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News