- Advertisement -
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఎగుమతుల ప్రోత్సాహక అధికారిక వ్యవస్థను ప్రకటిస్తుంది. రూ 2250 కోట్ల కేటాయింపులతో ఈ ఎగుమతుల ప్రోత్సాహక విభాగం ఏర్పాటు అవుతుందని అధికారులు తెలిపారు. ట్రంప్ భారీ సుంకాలు, ప్రపంచ స్థాయిలో వాణిజ్యపరమైన ఆటుపోట్ల నడుమ తగు విధంగా పరిశ్రమలు తట్టుకునేందుకు వీలుగా ఈ ప్రమోషన్ మిషన్ ఏర్పాటు అవుతుంది. ఎగుమతిదార్లతో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఏ విధంగా వారిని అత్యయిక స్థితిలో ఆదుకోవల్సి ఉంటుందనేది విధివిధానాల ద్వారా ఖరారు చేసుకుని ఈ వ్యవస్థను రూపొందిస్తారని అధికారులు తెలిపారు. వ్యాపార నిర్వహణ, ఎగుమతుల ప్రక్రియ సులభతరం దిశలో ఈ వ్యవస్థకు రూపకల్పన జరుగుతుంది. ఈ ఏర్పాటు గురించి ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రకటన వెలువరించింది.
- Advertisement -