Monday, October 14, 2024

పిఎఫ్‌ఐపై నిషేధం విధించి కేంద్రం ప్రపంచానికే ఆదర్శమైంది: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియన్ పోలీస్ సర్వీస్ ట్రైనీ ఆఫీసర్ల 74వ ఆర్‌ఆర్ బ్యాచ్ ఆదివారం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి కవాతు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ‘దీక్షంత్ పరేడ్’లో 195 మంది ఆఫీసర్ ట్రైనీలు పాల్గొన్నారు, వీరిలో 166 మంది ఐపిఎస్ ఆఫీసర్లు, వివిధ దేశాల నుంచి 28 మంది ఆఫీసర్ ట్రైనీలు ఉన్నారు. ఆరుగురు భూటానీలు, ఎనిమిది మంది మాల్దీవియన్లు, ఐదుగురు నేపాలీలు, పది మంది మారిషస్ పోలీస్ అధికారులు విదేశీ శిక్షణ పొందిన వారిలో ఉన్నారు. నల్సార్‌తో ఎస్‌విపిఎన్‌పిఎ మెమోరాండం ఆఫ్ అందర్సాండింగ్‌లో భాగంగా ఆఫీసర్ ట్రైనీలు మొదటిసారిగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలను పొందుతారు, ఇతర దేశాల నుండి ఆఫీసర్ ట్రైనీలుగా శిక్షణ పూర్తి చేసుకున్నవారు డిప్లొమా సర్టిఫికేట్లు పొందుతారు.

ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, దేశ అంతర్గత భద్రత ఎప్పుడూ పోరాటమేనని, బెదిరింపులను ఎదుర్కోడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ)ను నిషేధించడం ద్వారా ప్రభుత్వం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పోలీసింగ్ అంశాలు ఏకదిశ(యూనిడైరెక్షన్) నుండి బహుమితీయంగా(మల్టీడైమెన్షనల్) మారాయని, అధికారులు కొత్త సవాళ్లను స్వీకరించి, సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News