Tuesday, June 4, 2024

చలసాని కూతురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Chalasani Daughter commit suicide in AP

 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కూతురు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శీరిష్మ ప్రస్తుతం ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ఓయు కాలనీలో ట్రయల్ విల్లాస్‌లో తన భర్త సిద్ధార్థ్‌తో కలిసి జీవిస్తోంది. 2016లో సిద్ధార్థ్‌ను పెళ్లి చేసుకుంది. ఇంతవరకు పిల్లలు లేకపోవడంతో మానసికంగా కుంగిపోయింది. బుధవారం రాత్రి భర్తలేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఇంటికి వచ్చిన భర్త…   శిరిష్మ ఫ్యాన్ వేలాడుతుండడం గమనించి  స్థానిక ఆస్పత్రికి తరలించాడు. ఆమె అప్పటికే మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News