Wednesday, April 24, 2024

చంద్రయాన్ 3 ప్రయోగం ఈఏడాది లేనట్టే

- Advertisement -
- Advertisement -

Chandrayaan-3 likely to be launched during third quarter of 2022

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా చంద్రయాన్ 3 ప్రయోగాలు నిలిచిపోవడంతో ఈ ప్రయోగం మరింత ఆలస్యం కానున్నదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2022 మూడవ త్రైమాసికంలో చంద్రయాన్ 3 మిషన్‌ను చంద్రుడి మీదకు ప్రయోగించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇస్రో ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహించారు. అన్‌లాక్ తర్వాత నుంచి చంద్రయాన్ 3 పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవన్నీ త్వరలో పూర్తి కానున్నాయని ఆయన వెల్లడించారు. చంద్రయాన్ 3 ఈ ఏడాదిలో ప్రారంభించాల్సి ఉండగా, కొవిడ్ లాక్‌డౌన్ ప్రభావం దీనిపై పడింది.ఇస్రోకు చంద్రయాన్ 3 చాలా కీలకమని, 2022 లో ఈ ప్రయోగం ఉంటుందని ఇస్రో చైర్మన్ కె.శివన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News