Thursday, March 28, 2024

కేరళను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి

- Advertisement -
- Advertisement -
Corona epidemic plaguing Kerala
రోజువారీ కేసుల్లో సగం ఒక్క కేరళ లోనే

తిరువనంతపురం : కరోనా సెకండ్ వేవ్ ముగిసి పోలేదని దేశం లోని కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో ఉధృతంగా ఉంటోందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వెలిబుచ్చింది. మిగతా రాష్ట్రాల్లో రోజువారి వందల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుండగా, కేరళలో మాత్రం నిత్యం 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని వివరించింది. కరోనా వెలుగు చూసిన మొదట్లో వైరస్ వ్యాప్తిని కేరళ ప్రభుత్వం అడ్డుకోగలిగింది. కేరళను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొనియాడింది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కొవిడ్ అదుపు లోకి వచ్చినప్పటికీ కేరళలో మాత్రం 10 వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. నిన్న మొన్నటివరకు వైరస్‌తోవణకి పోయిన మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో 40 శాతం ఒక్క కేరళ లోనే ఉంటున్నాయి.

గడచిన 24 గంటల్లో అక్కడ అత్యధికంగా 22 వేల పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్ పంపిణీలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ వేగంగా అందిస్తోంది. ఇక్కడ 18 ఏళ్ల వయసున్న జనాభాలో 21 శాతం మందికి రెండు డోసుల్లో వ్యాక్సిన్ అందింది. దేశ సరాసరి 9.9 శాతం ఉండగా, కేరళ అంతకు మించి పంపిణీ చేసింది. అయినా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించడం లేదు. ఐసిఎంఆర్ నిర్వహించిన సీరో సర్వేలో దేశ వ్యాప్తంగా సరాసరిగా 67.6 శాతం మందిలో యాంటీబాడీలు ఉండగా, కేరళలో మాత్రం 42.7 శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో మరో 43 శాతం మంది కేరళ ప్రజలకు వైరస్ ముప్పు పొంచి ఉందని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే కేరళలో ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News