Saturday, April 27, 2024

20 నెలల కనిష్ఠానికి క్రియాశీలక కేసులు

- Advertisement -
- Advertisement -

7081 new covid-19 cases reported in india

న్యూఢిల్లీ : మనదేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య ఆదివారం కొంతమేర తగ్గింది. గత 24 గంటల్లో 7,081కొత్త కేసులు వెలుగు చూడగా, 264 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు తగ్గాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కి చేరగా, ఇంతవరకు 4,77,422 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. 3,47,40,275 మంది కొవిడ్‌ను జయించారు. క్రియాశీల కేసుల సంఖ్య 83,913 (0.24 శాతం) కి తగ్గింది. మార్చి 2020 తరువాత యాక్టివ్ కేసుల్లో ఇదే అత్యల్పం. దేశ వ్యాప్తంగా శనివారం 12, 11,977 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఇక శనివారం కొత్తగా 76,54,466 మంది టీకా తీసుకున్నారు. దీంతో మొత్తం వ్యాక్సినేషన్ల సంఖ్య 137,46 ,1౩, 252 కు చేరింది. ఇక దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య శనివారం 143 కి పెరిగింది. తెలంగాణలో నిన్న 12 కొత్త కేసులు వెలుగు లోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య రాష్ట్రంలో 20 కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 48 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. తరువాత ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, కేరళలో 11, గుజరాత్‌లో 7 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, చండీగడ్‌ల్లో ఒక్కో కేసు చొప్పున గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News