Friday, September 13, 2024

ఈ ఏడాది 106 శాతం పెరిగిన విదేశీ పర్యాటకుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో మనదేశానికి వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య గత ఏడాది కన్నా 106 శాతం పెరిగిందని, అదే విధంగా విదేశీ మారక ద్రవ్యం పెరిగిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కరోనా మహమ్మారి తరువాత దేశంలో స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యను ఇంకా పెంచుకోవాలన్న ఆకాంక్షతో టూరిజం అభివృద్ధికి విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

గత ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 21.24 లక్షల మంది విదేశీ పర్యాటకులు దేశానికి రాగా, ఈ ఏడాది ఇదే కాలంలో 43.80 లక్షల మంది అరుదెంచారని చెప్పారు. స్వదేశీ పర్యాటకానికి సంబంధించి 2021లో 677 మిలియన్ మంది స్వదేశీ పర్యాటకులు ఉండగా, 2022లో 1,731 మిలియన్ మంది, అదనంగా 1.09 కోట్ల మంది పెరిగారని వివరించారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణమయ్యాక వారణాసి క్షేత్రంలో టూరిజం బాగా పెరిగిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

2022లో 7.16 కోట్ల మంది కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించగా, 2023లో జనవరి మే మధ్య కాలంలో 2.29 కోట్ల మంది ఆలయాన్ని సందర్శించారు. కారిడార్ ప్రారంభమయ్యాక దాదాపు 10 కోట్ల మంది కాశీ విశ్వనాథ ఆలయాన్నిసందర్శించారని ఆలయ ట్రస్ట్ సిఇఒ సునీల్ వర్మ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News