Tuesday, April 30, 2024

2020లో చంద్రయాన్ -3 మిషన్

- Advertisement -
- Advertisement -

Jitendra-Singh

న్యూఢిల్లీ : చంద్రగోళంపై 2020 లో మళ్లీ లాండర్, రోవర్ ద్వారా చంద్రయాన్ 3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుందని కేంద్ర అంతరిక్ష విభాగ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ధ్రువీకరించారు. మంగళవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. చంద్రయాన్ 2 మిషన్ వైఫల్యం అయిందని అనుకోరాదని ఇదివరకే తాను చెప్పానని, దాని వల్ల చాలా నేర్చుకున్నామని మంత్రి వివరించారు. మొదటి ప్రయత్నంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశం ఏదీ లేదని, ఈ విషయంలో అమెరికా అనేక సార్లు ప్రయత్నించిందని, కానీ అన్ని సార్లు మన కు ప్రయత్నించ వలసిన అవసరం లేదని ఆయన అన్నారు.

ఈసారి ల్యాండింగ్ విజయవం తమైతే అమెరికా, రష్యా, చైనా తరువాత ప్రపంచంలో నాలుగో దేశం భారత్ అవుతుందని ఆయన ఆశా భావం వెలిబుచ్చారు. ముందుగా అనుకున్న దాని కన్నా ల్యాండర్ వేగం తగ్గించడమే ఢీకొనడానికి దారి తీసిందని పార్ల మెంటులో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. గత సెప్టెంబర్ 7న చంద్ర యాన్ 2 మిషన్‌లో విక్రమ్ నిర్ణయించిన ప్రదేశా నికి 500 మీటర్ల దూరంలో ల్యాండ్ అయింది. అప్పుడు వేగాన్ని 1683ఎం/ఎస్ నుంచి 146 ఎం/ఎస్‌కు తగ్గించారు. డిజైన్ చేసిన దాని కన్నా ఎక్కువగా వేగం తగ్గించడం వల్ల గమనంలో మా ర్పు వచ్చి అనుకున్న ప్రదేశానికి దూరంగా 500 మీటర్ల పరిధిలో ఢీకొందని చెప్పారు

Chandrayaan 3 Most Likely To Start In 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News