Thursday, May 2, 2024

పెట్టుబడుల పేరుతో మోసాలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పెట్టుబడుల పేరుతో అమాయకులను సైబర్ నేరస్థులు మోసం చేస్తున్నారని సైబరాబాద్ క్రైం డిసిపి కల్మేశ్వర్ అన్నారు. సైబర్ నేరస్థుల చేతుల్లో మోసపోయిన బాధితులకు డబ్బులు తిరిగి ఇచ్చారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపిలు రితీరాజ్, కల్మేశ్వర్, విశ్వజిత్ కంపాటి వివరాలు వెల్లడించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజుకు 100 వరకు సైబర్ నేరాలపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. 44 కేసుల్లో మోసపోయిన బాధితులకు రూ.2,23,89,575 పంపిణీ చేశారు.

ఓ కేసులో రూ.12లక్షలు మోసపోయిన బాధితురాలికి పోలీసులు మొత్తం రికవరీ చేశారు. సైబర్ నేరస్థుల చేతిలో మోసపోయిన వెంటనే బాధితులు 1930కు ఫోన్ చేయాలని లేదంటే ఎన్‌సిఆర్‌పి పోర్టల్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయాలని కోరారు. దీంతో పోలీసులు వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించి పేమెంట్ గేట్‌వేను ఆపివేస్తారని తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేయగానే పోలీసులు 102 సిఆర్‌పిసి ప్రకారం బ్యాంక్ ట్రాన్‌జాక్షన్లను పరిశీలిస్తారని తెలిపారు. దీని వల్ల బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పించవచ్చని తెలిపారు. పోలీసులకు 24 గంటల్లో ఫిర్యాదు చేయకుంటే రికవరీ కష్టమని తెలిపారు. ఇలా నమోదైన కేసుల్లో కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు తిరిగి డబ్బులు అందజేస్తామని తెలిపారు.

అధిక వడ్డీ పేరుతో….
ఆన్‌లైన్‌లో తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి సైబర్ నేరస్థులు ప్రకటనలు ఇస్తున్నారని, వాటిని చూసి మోసపోవద్దని క్రైం డిసిపి కల్మేశ్వర్ అన్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా పెట్టుబడుల పేరుతో ఆన్‌లైన్‌లో మోసాలు చేస్తున్నారని, దేశంలో అన్ని ప్రాంతాల్లో సైబర్ నేరస్థులు ఉన్నారని తెలిపారు. చాలామంది బాధితులు అత్యాశకు పోయి మోసపోతున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News