Friday, May 3, 2024

7.1 శాతం పెరిగిన చైనా రక్షణ బడ్జెట్..

- Advertisement -
- Advertisement -

China Defence budget Grow 7.1 percent

బీజింగ్: చైనా తన వార్షిక రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచింది. గత ఏడాది 209 బిలియన్ డాలర్లును రక్షణ బడ్జెట్‌ను ఈ ఏడాది 7.1 శాతం పెంచుతూ 230 బిలియన్ డాలర్లకు చేర్చింది. 2022 ఆర్థిక సంవత్సరానికి చైనా ప్రభుత్వం రక్షణ బడ్జెట్ కోసం 1.45 ట్రిలియన్ యువాన్(230 బిలియన్ల అమెరికన్ డాలర్లు) ప్రతిపాదించిందని, ఇది గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే 7.1 శాతం అధికమని చైనా ప్రధాని లీ కెక్వియాంగ్ శనివారం నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(చైనా పార్లమెంట్)కి సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఉటంకిస్తూ చైనా డైలీ తెలిపింది. ఈ పెంపుదల.. 2022 సంవత్సరానికి భారత ప్రభుత్వం కేటాయించిన రూ.5.25లక్షల కోట్ల(సుమారు 70 బిలియన్ అమెరికన్ డాలర్లు) రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే మూడు రెట్లు అధికం. గత ఏడాది&మొట్టమొదటిసారిగా చైనా రక్షణ వ్యయం 200 బిలియన్ డాలర్లు అధిగమించింది. 2021లో చైనా తన రక్షణ బడ్జెట్‌ను అంతకు ముందు ఏడాది కన్నా 6.8 శాతం పెంచింది. దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను, అభివృద్ధి ప్రయోజనాలను పరిరక్షించే లక్షంతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని మరింత బలోపేతం చేయడంతోపాటు సన్నద్ధంగా ఉంచాల్సిన అవసరం ఉందని చైనా ప్రధాని పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

China Defence budget Grow 7.1 percent

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News