Friday, May 3, 2024

రైతులకు 2లక్షల ఋణమాఫీ: బట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రేస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని సిఎల్పీ నేత బట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. శనివారం పీపుల్స్ మార్చ్ యాత్ర విరామ పమయంలో నాగంపేట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ దేశ సంపదను మొత్తం అదాని, అంబానీలాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే పనిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్,డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్య, మధ్యతరగతి మోయలేని భారం మోపారని మండిపడ్డారు.

పరాయి పాలనలో తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలలో తీవ్ర అన్యాయం జరుగుతుందని, 4కోట్ల ప్రజలు ప్రత్యే రాష్ట్రం ఏర్పాటుతో తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, సబ్బండ వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రంలోని భాజాపా, రాష్ట్రంలోని బిఆర్‌ఎస్ రెండు ఒకటేనని, ప్రజల దృష్టి మర్లించడానికే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని అన్నారు. భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు మీడియాతో కేసీఆర్ చిట్టా మాదగ్గర ఉందని డోలు కొడుతుంటాడు తప్ప బయటపెట్టిన దాఖలాలు లేవని, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ వార్తల్లో ఉంటు ప్రజల దృష్టి మర్లిస్తారనియన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిజస్వరూపం ప్రజలకు అర్థమైపోయిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని ప్రజలు గ్రహించారని, యాత్రలో ప్రజలు అనేక సమస్యలు తన దృష్టికి తెచ్చారని తెలిపారు. పాలకులు పోలీసులను పార్టీల సొంత పనులకు వాడుకుంటున్నారన్నారు.

Also Read: అధికారం అండగా ప్రభుత్వ భూమి కబ్జా..

ఇదే అదనుగా భావించిన పోలీసులు మాత్రం ఇసుక మాఫియాకు తొత్తులుగా మారారన్నారు. పాలకుల తప్పులను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి, బయాబ్రాంతుకలు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టిన పాపానపోలేదని, ఇచ్చిన నోటిఫికేషన్ లీక్ కావడంతో ఇదే అదునుగా భావించిన చేతులు దులుపుకొందని ఎద్ధేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, స్వంత ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మాణం కొసం 5లక్షల రూపాయలను అందిస్తామని, రైతులకు ఒకే దపా 2లక్షల ఋణమాఫీ చేస్తామన్నారు.

అంతకు ముందు జమ్మికుంట మండలం తనుగుల గ్రామం వద్ద పీపుల్స్ మార్చ యాత్రకు పార్టీ హుజురాబాద్ నియోజకవర్త ఇంచార్జి బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు బట్టి విక్రమార్కకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు. విలేకరులు సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎన్‌ఎన్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ నియోజకవర్గ ఇంచార్జి తో పాటు స్థానిక కాంగ్రేస్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News