Sunday, April 28, 2024

మూడో రోజూ బిజీబిజీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ బిఆర్‌ఎస్ జాతీయ కార్యాలయంలో సిఎం కెసిఆర్
ఎంపిలు, పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో చర్చలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీలోని సర్దార్‌పటేల్ మార్గ్‌లో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని శుక్రవారం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సందర్శించారు. మధ్యాహ్నం 1.38 గం.లకు ఆఫీస్‌కు చేరుకున్న కెసిఆర్ తన ఛాంబర్‌లో కూర్చొని ఎంపీలు, పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో కాసేపు చర్చించారు. అనంతరం కార్యాలయ మొదటి రెండో అంతస్థుల్లో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హల్‌ను, పలువురికి కేటాయించిన చాంబర్లను, కలియ తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా కెసిఆర్ పలు సూచనలు చేశారు. ఆనంతరం తనను కలిసేందుకు అక్కడికి చేరుకున్న బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు అభిమానులకు, అభివాదం చేస్తూ పలకరిస్తూ ముందుకు సాగారు.

ఈ సందర్భంగా జై భారత్…. జై కెసిఆర్… జై బిఆర్‌ఎస్ నినాదాలు పార్టీ పరిసర ప్రాంతాల్లో మారుమోగాయి. ఈ సందర్భంగా కెసిఆర, బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కె. కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, దామోదర్ రావు, జోగిన పల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, కెఆర్. సురేష్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, పి. రాములు తదితర ప్రముఖులు,రైతు సంఘాల నాయకులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం కెసిఆర్‌ను ఎంపి వెంకటేష్ నేతకాని, మాజీ ఎంపి సీతారాం నాయక్, శాసనసభ్యుడు చంటి క్రాంతికిరణ్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన గులాబీ శ్రేణులు ‘జిందాబాద్ జిందాబాద్…బిఆర్‌ఎస్ జిందాబాద్‘,‘వర్థిల్లాలి వర్థిల్లాలి…కెసిఆర్ నాయకత్వం వర్థిల్లాలి‘,‘దేశ్ కా నేత కైసే హో …. కెసిఆర్ జైసే హో‘,‘ఆబ్ కా బార్ కిసాన్ సర్కారు ‘అనే నినాదాలతో మరోసారి పరిసర ప్రాంతాలన్నీ హోరెత్తాయి.

హైదరాబాద్‌కు చేరుకున్న కెసిఆర్

దేశ రాజధానిలో నాలుగు రోజుల తన పర్యటన ముంగిచుకుని కెసిఆర్ శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నెల 14వ తేదీన బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం 12న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. 13,14 తేదీల్లో ఆయన రెండు రోజుల పాటు నిర్వహించిన రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. బుధవారం (14న) మధ్యాహ్నం 12.37 గంటలకు కెసిఆర్ బిఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు, రైతు సంఘం నేతలు, బిఆర్‌ఎస్ నేతలు పెద్దసంఖ్యలో హాజరైన విషయం తెలిసిందే. కాగా 15న కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కెసిఆర్ కలిసి సమావేశమయ్యారు. కాగా శుక్రవారం (16న) ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మరోసారి కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి పలువురు నేతలతో సమావేశమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News