Thursday, May 2, 2024

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR conveys Ramzan greetings

హైదరాబాద్ : పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరీసోదరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస ధీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని, తెలంగాణలో గంగా జమునా తహజీబ్కు రంజాన్ పర్వదినం ప్రతీక అని సిఎం అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, గుణాత్మక ఫలితాలనిస్తున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు.

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్
ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని విజ్ఞప్తి

ముస్లిం సోదరులకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి తెలంగాణ పెట్టింది పేరని అన్నారు. ఇస్లాం.. శాంతి, ప్రేమ, సోదర భావాన్ని ప్రబోదిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని మతాలు, కులాలను సమానంగా చూస్తున్నారని పేర్కొన్నారు. గంగాజమున తహజీబ్గా పేరొందిన ఈ రాష్ట్రంలో ప్రజలందరి భద్రతకు, సంక్షేమానికి సిఎం కెసిఆర్ ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతికకి ఈ ఏడాది బడ్జెట్లో 1,606 కోట్లు కేటాయించామన్నారు. 204 గురుకులాల ద్వారా మైనార్టీలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తుండటంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయన్నారు. రంజాన్ సందర్భంగా 4,50,000 మంది పేద ముస్లింలకు చీరలు, దుస్తులను అందించామని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా సామూహిక విందులను ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని.. ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. జామే నిజామియాలో రూ.15 కోట్లతో అత్యాధునిక ఆడిటోరియం.. కోకాపేటలో 10 ఎకరాల్లో ఇస్లామిక్ కల్చరల్, కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐఎఎస్, ఐపిఎస్ సాధించాలనుకునే 100 మంఇ యువతకు వారు కోరుకున్న చోట శిక్షణ ఇప్పిస్తున్నామని, ముస్లిం సమాజం ఆచరించిన పవిత్ర ఉపవాస దీక్షలు, భక్తిప్రపత్తులతో జరిపే ప్రార్ధనలతో కరోనా మహమ్మారి పీడ విరుగడ కావాలని ఆకాంక్షించారు.

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు: తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ను పురస్కరించుకుని ముస్లిం సోదర, సోదరీమణులకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని, పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రంజాన్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతున్నందున రంజాన్ పండుగను ఎవరి ఇంట్లో వారే కుటుంబసభ్యులతో కలిసి జరుపుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News