Friday, March 29, 2024

రేపు కరీంనగర్‌కు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సిఎం సూచనలు చేయనున్నారు. రామడుగు మండలంలోని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉండడంతో దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

సిఎం కెసిఅర్ రాక నేపథ్యంలో ఇప్పటికే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్‌కు చెందిన రైతు రాంచంద్రారెడ్డికి చెందిన పంట పొలాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ బుధవారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానతో తీవ్రంగా పంట నష్టపోయిన రైతులను కలిసేందుకు గురువారం జిల్లాకు సిఎం రానుండడంతో బుధవారం పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్లతో కలిసి రామడుగు మండలంలో పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.

పంటనష్టానికి సంబంధించి సమగ్ర నివేదికతో అధికారులు సిద్ధంగా ఉండాలని, ముఖ్యమంత్రి జిల్లాకు చేరుకొని తిరిగి వెళ్ల్లేవరకు అందరూ అందుబాటులో ఉండాలని, దీనికోసం పక్కా ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు జి.వి. శ్యామప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, వ్యవసాయ అధికారి శ్రీధర్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News