Friday, May 3, 2024

ఆందోళన వద్దు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

CM Kejriwal press meet over Corona Cases

న్యూఢిల్లీ: ఢిల్లీలో కేసులు పెరుగుతున్నా, ఎక్కువమందిలో లక్షణాలు లేవని(అసింప్టమేటిక్), ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉన్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కొద్దిమందిలో మాత్రమే స్వల్ప లక్షణాలున్నందున ఆందోళన అవసరం లేదన్నారు. ఆదివారం 3100 కేసులు నమోదు కానున్నట్టు అంచనా ఉన్నదని, ప్రస్తుతం క్రియాశీలక కేసులు 6360 కాగా, 82 మంది మాత్రమే ఆక్సిజన్ పడకలపై ఉన్నారని, 99.72 శాతం ఆక్సిజన్ పడకలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
శనివారం ఢిల్లీలో 2716 కేసులు నమోదయ్యాయి. గతేడాది మే 21 తర్వాత ఇదే అధికం. పాజిటివిటీ రేట్ 3.64శాతంగా నమోదైంది. డిసెంబర్ 26న ఇది 0.55 శాతం మాత్రమే. శనివారం ఒక్కరోజే ఢిల్లీలో 351 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రెండో ఉధృతితో పోలిస్తే, మూడో ఉధృతిగా భావిస్తున్న ఈ తరుణంలో ఆస్పత్రుల్లో చేరేవారు, మరణాల సంఖ్య తక్కువని కేజ్రీవాల్ తెలిపారు. ఆ సమయంలో ఢిల్లీలో రోజుకు సగటున 10 చొప్పున మరణాలు నమోదు కాగా, ఇప్పుడు ఒకటి లేదా జీరో మరణాలు మాత్రమేనని ఆయన తెలిపారు. గతేడాది మార్చి 27న క్రియాశీలక కేసులు 6600 కాగా, ఆక్సిజన్ పడకలపై ఉన్నది 1150మంది. అదేరోజు వెంటిలేషన్‌పై ఉన్నది 145 మంది కాగా, ఇప్పుడు జనవరి 2న ఆ సంఖ్య ఐదు మాత్రమేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

CM Kejriwal press meet over Corona Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News