Thursday, May 23, 2024

తెలంగాణపై మోడీకి చిన్నచూపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :దక్షిణ భారతం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా వ్యవహరిస్తు న్నారని, రానున్న రోజుల్లో ఆయన ఇలాగే వ్యవహరిస్తే ఉత్తర, దక్షిణ భారత్‌ల మధ్య ఘర్షణలు ప్రారంభమవు తా యని సిఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓ ఆంగ్ల న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో అనేక వివాదాంశా లను ప్రస్తావించారు. తెలంగాణ పట్ల మోడీకి మొదటి నుంచి చిన్నచూపేనని వ్యాఖ్యానించారు. బిజెపి విజయానికే ఎంఐ ఎం అధినేత ఒవైసి పాటుపడుతున్నారని ఆరోపించా రు. ముస్లిం ఓట్లను సమీకృతం చేయడం ద్వారా బిజెపికి ఆయన ఉపయోగపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట ర్వూ లోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి…

వాతావరణం ఎందుకు ? ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు ఎందుకు ?
సిఎం: అది గేమ్ రూల్. ఒకప్పుడు ఎన్నికలు ఐడియాలజీ ప్ర కారం జరిగేవి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత పాతపద్ధతిని అందరూ మరిచిపోయారు. ఎన్నికల్లో గెలవాలంటే ఏమైనా చేయాలి. దానికోసం ఏమైనా చెప్పండి. ఏ వాగ్దానమైనా చేయండి.ఈ విధంగా పోటీ ఎలా అయిపోయిందంటే ఒక క్రీడాకారుడు మధ్యలో నుంచి పోటీ మొదలు పెడితే అనివార్యంగా ఇతర ప్లేయర్‌లు కూడా అదే పాటించా ల్సి వస్తోంది.అందుకే ఇంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడుతోంది.
ప్రశ్న:: ఈ గేమ్‌లో రూల్స్ లేవా. రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి అని అసదుద్దీన్ అంటారు. దీంతోపాటు మీరు ఎన్నికల తరువాత కొంతమంది ఎమ్మెల్యేలతో బిజెపిలో చేరుతారని కెసిఆర్ అంటారు. మీరు మాత్రం బిఆర్‌ఎస్, బిజెపికి బి టీమ్ అని, ఆరోపిస్తున్నారు ? ఇక్కడ ఏం నడుస్తుంది. ఎవరు ఎక్కడున్నారు.

పేల్చుకుంటున్నారు ఎందుకు ?
సిఎం: నాపై అసద్, కెసిఆర్, బిజెపి వాళ్లు అనేక అంభాడాలు వేస్తున్నారు. అయినా ప్రజలు వాళ్లకు మంచి జవాబు ఇస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు ఈ మూడు పార్టీలకు బుద్ధిచెప్పినా వారిలో మార్పురావడం లేదు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు వారికి బుద్ధి చెబుతారు. తెలంగాణ ప్రజలు తెలివైన వారు. ఎవరు ఎం మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు. ఎవరి కోసం పని చేస్తున్నారన్న విషయాన్ని గ్రహిస్తున్నారు.
పేల్చుకుంటున్నారు ఎందుకు ?
సిఎం: నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడగదల్చుకున్నాను. దారుస్సలాం కార్యాలయం ఎక్కడుందో తెలుసా ? ఏ నియోజకవర్గంలో ఉందో తెలుసా ?
ప్రశ్న:: ఈ ప్రశ్న అడిగే పని నాది కదా !
సిఎం: కాదు, నేను అందరికీ తెలియాలని ఈ ప్రశ్న వేస్తున్నాను. ఎంఐఎం కార్యాలయం గోషామహల్‌లో ఉంది. అక్కడ బిజెపి నుంచి రాజా సింగ్ ఎమ్మెల్యే. బిజెపిని ఓడించటానికి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పే ఒవైసి, అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌లో ఎందుకు అభ్యర్థిని ప్రకటించలేదు. దీని అర్ధం ఏమిటీ ?

ప్రశ్న:: కానీ, మీరు కూడా ఒవైసికి వ్యతిరేకంగా మీ అభ్యర్థిని ప్రకటించ లేదు? ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో మీ మైనార్టీ ఓటు బ్యాంకుకు ఎలాంటి ఆటంకం ఉండ కూడదనేనా?
పేల్చుకుంటున్నారు ఎందుకు ?
సిఎం: మీతో ఎవరన్నారు. ప్రకటించడం లేదని, ఈనెల 25వ తేదీ వరకు హైదరాబాద్ ఎంపి అభ్యర్థిని ప్రకటించడానికి మాకు సమయం ఉంది. నా గురించి వదిలేయండి. ముస్లింలు మెజారిటీగా ఉన్న హైదరాబాద్ స్థానానికి నరేంద్ర మోడీ ఒక హిందూ అభ్యర్థిని నిలబెట్టారు. తద్వారా ముస్లిం ఓట్లన్నీ ఒవైసి కొరకు సమీకృతం అవుతాయి. ఒవైసి గెలుస్తారు. ఒకవేళ మోడీకి ఒవైసిని ఓడించాలన్న ఉద్దేశం ఉంటే ఇక్కడ బిజెపి నుంచి ఒక ముస్లిం అభ్యర్థిని ప్రకటించే వారు. ఆలా జరిగితే ఇక్కడ ముస్లిం ఓట్లు చీలి హిందూ ఓట్లు సమీకృతమైయ్యేవి. కానీ, ఇక్కడ మీకు బిజెపి, ఎంఐఎం గేమ్‌ప్లాన్ స్పష్టంగా కనిపిస్తుంది. హిందూ, ముస్లిం ఓట్ల చీలిక ఇక్కడ ఒవైసిని గెలిపించే ప్రయత్నంలో భాగమే. మీరు దేశంలో ఎక్కడైనా చూడండి. ఒవైసి ఎక్కడికి వెళ్లినా ముస్లిం ఓట్లను చీలుస్తున్నారని అనుకునేలా వ్యవహరిస్తుంటారు, కానీ, ఆయన పనిచేసేది బిజెపి అనుకూలంగానే.
ప్రశ్న: నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా మీరు ఒక హిందువు వా ముస్లిం నా !?

ముఖ్యమంత్రి: ఎందుకు మీకు ఆ డౌట్ ఎందుకొచ్చింది.. ?
ప్రశ్న: ఎందుకంటే మీ అభిప్రాయం ప్రకారం అసదుద్దీన్ ఓవైసిపై గెలవాలంటే ఒక ముస్లిం నేత అయి ఉండాలే. ఒక హిందు అభ్యర్థి గెలవలేరు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మీరు ఒక హిందువు. మరి అందరి గురించి ఆలోచించాలి కదా..!
పేల్చుకుంటున్నారు ఎందుకు ?
సిఎం: ఇక్కడ ప్రభుత్వం ఎలా నడిపించాలన్న దానిపై చర్చ జరగడం లేదు. ఎన్నికల వ్యూహంపై మాత్రమే చర్చ జరుగుతుంది.. ప్రభుత్వం నడపాలంటే, ఎవరు ఎలా ఉండాలి, ఏ విధంగా నడపాలన్నదే ఆలోచిస్తారు. కానీ, ఎన్నికల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు వ్యూహాత్మకంగా వ్యవహారిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఎందుకు వేస్తున్నారు.. సునీల్ కనుగోలు ఎందుక్కున్నారు.
ఇది గమనించండి. నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో తాను ఒక ఓబిసి నేతగా ప్రకటించుకుంటారు. ఒక దేశ ప్రధాన మంత్రి ఈ విధంగా ప్రకటించొచ్చా. ? ఓబిసి అని అంటే ఏమిటీ? మోడీ అగ్ర వర్ణాలకు వ్యతిరేకమా ? మీరేమంటారు. ?
ప్రశ్న: కానీ, మీ నాయకుడు రాహుల్ గాంధీ అందరినీ మీదే కులం అని అడుగుతుంటారు. చివరకు విలేకరులను కూడా మీదే కులం అని అడుగుతారు. మోడీ ఒబిసిల కొరకు పని చేస్తారు. ఆయన వారి బాగు కోసం పని చేస్తున్నాం.. !
పేల్చుకుంటున్నారు ఎందుకు ?

సిఎం: నేను మోడీ పని గురించి మాట్లాడడం లేదు. ఆయన తనను తాను ఒబిసిగా ప్రకటించుకున్నారు. రాహుల్ గాంధీ కిందిస్థాయి వ్యపారులు, వ్యక్తులతో మాట్లాడి వారి కులం గురించి అడుగుతున్నారు. ఎందుకంటే ఈ దేశంలో సంపద ఎవరి దగ్గర సమీకృతమైందని వారు దేశాన్ని చూపించాలనుకుంటున్నారు. కానీ, తమకు తాను నేను ఓబిసి అని, నేను దళిత్ అని రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రకటించుకోరు. రాహుల్ ఎప్పుడూ తాను ఒక భారతీయుడనని, కాంగ్రెస్ అని మాత్రమే ప్రకటిస్తారు.. కానీ, నరేంద్ర మోడీ ఏమంటారు. తాను ఒబిసి అని ప్రకటించుకుంటారు. ఒక దేశ ప్రధాని ఆలా వ్యాఖ్యానించ వచ్చా. అయన అందరికి ప్రధాని కదా !
ప్రశ్న: ఆదిలాబాద్ సభ లో ప్రధాని మోడీని మీరు బడే భాయ్ అని సంబోధించారు దానిపై మీ వ్యాఖ్యలేమిటి?
పేల్చుకుంటున్నారు ఎందుకు ?

సిఎం: అందులో తప్పేముంది. నాకు ఆ విషయాన్ని గుర్తు చేసి మంచి పని చేశారు. ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఈ పద్ధతిలో ప్రధాన మంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు బడా భాయ్ యే కదా!. ఈ రోజు ఆ కుర్చీలో నరేంద్ర మోడీ ఉన్నారు. కొన్ని అంశాలు రాష్ట్ర జాబితాలో, కొన్ని కేంద్ర జాబితాలో , మరికొన్ని ఉమ్మడి జాబితాలో ఉంటాయి. ట్యాక్స్, జిఎస్‌టిల రూపంలో డబ్బులు కేంద్రానికి వెళ్తున్నాయి. నరేంద్ర మోడీ వాటి గురించి అనుమతులివ్వాలి. మా తెలంగాణలో కొన్ని నీటి పారుదల ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులివ్వలేదు. అందుకు ప్రాజెక్ట్ వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రధాని వారి రాష్ట్రానికి బులెట్ ట్రైన్ తీసుకెళ్లారు. గిఫ్ట్ సిటీ చేసుకున్నారు. గుజరాత్‌కు సబర్మతి రివర్‌ఫ్రంట్ చేసుకున్నారు. ఇంకా మరెన్నో నిధులను కేంద్రం నుంచి గుజరాత్ కు తీసుకెళ్లారు. ఎవరైనా తెలంగాణలో పెట్టుబడి గురించి వస్తే వారిని బెదిరించి మరి గుజరాత్‌కు తరలించారు. అయితే ప్రధాని అందరిని చిన్న తమ్ముళ్లు అనుకోని న్యాయం చేయాలని వారికి నేను గుర్తు చేశాను.
ప్రశ్న: మోడీని బడా భాయ్ అంటున్న మీరు మీ నాయకుడు రాహుల్ గాంధీని ఏమంటున్నారు. ? వారిద్దరూ సమానం కాదు కదా. బడే భాయ్ చోటా భాయ్ కాదు కదా. ఒకటే కుర్చీ గురించి పోరాడుతున్నారు కదా. అంటే వారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ అని చౌకీదార్ చోర్ హై అంటే నడుస్తుందా. మీరు కేవలం నిధులలో వాటా కోసమే ప్రధాని మోడీని బడే భాయ్ అంటారా.. ?
పేల్చుకుంటున్నారు ఎందుకు ?

సిఎం: మీరు అర్థం చేసుకోండి. ఇప్పడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఎవరున్నారు. రాహుల్ గాంధీ. అయితే అయన గెలుస్తే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అవ్వరు కదా. ఈ దేశ ప్రజలు నిర్ణయిస్తే నరేంద్ర మోడీని ఆ కుర్చీ నుంచి దించి రాహుల్ గాంధీని అక్కడ కూర్చో బెడుతారు. వారి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ సమానంగా ఉంది. ఇక్కడ బిజెపి అధ్యక్షుడు, కెసిఆర్‌తో మన లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ సమానంగా ఉంది. అందుకే ఒక ముఖ్యమంత్రిగా ప్రధానితో ఏమనాలి, అదే నేను అక్కడ మాట్లాడాను. అది కూడా ఒక ప్రభుత్వ కార్యక్రమంలోనే మాట్లాడాను. పార్టీ కార్యక్రమంలో కాదు, పార్టీ సభలో నేను ఏం మాట్లాడుతానో మీరు వినండి మీకు తెలుస్తుంది.
ప్రశ్న: సరే, నేను పార్టీ ప్లాట్‌ఫాంపై ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం. రాహుల్ గాంధీ సర్వే ప్రకారం బిజెపికి 150 కంటే ఎక్కువ సీట్లు రావంటున్నారు, ప్రియాంక గాంధీ 180 సీట్లు వస్తాయంటున్నారు, సిద్ద రామయ్య అంచనా ప్రకారం 200 సీట్లు, రేవంత్ అంచనా ప్రకారం 220 నుంచి 240 సీట్లు వస్తాయని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే బిజెపి ఇన్నీ సీట్లు వస్తాయని చెప్పుకుంటారా?
పేల్చుకుంటున్నారు ఎందుకు ?

సిఎం: అప్పుడప్పుడు మేము కూడా విలేకరులతో మాట్లాడుతూ ఉంటాం. వారు చెప్పిందే మేము చెబుతాం. కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు చెప్పిన విషయాలను మీరు మరిచిపోతున్నారు. ఈవిఎంలు లేకపోతే, నరేంద్ర మోడీ ఎన్నికల్లో పోటీ చేయలేరు. నరేంద్ర మోడీ భరోసా ఈవిఎం, ఈడీ, ఇన్‌కంట్యాక్స్, సిబిఐ, అదానీ,అంబానీలు. ఇదంతా మోడీ పరివార్. ఈ పరివార్ బలం తో ఎన్నికలు గెలవాలనుకుంటున్నారు మోడీ. ఈ పరివార్‌ను పక్కన పెట్టి బిజెపి సిద్ధాంతం తో ముందుకొస్తే అప్పుడు తెలుస్తుంది.
ప్రశ్న: రేవంత్ రెడ్డి మీరు ఇవే ఈవిఎం ద్వారా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మీరే వాటిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు? మరి తెలంగాణ ప్రజలకు కూడా వీటిపై అనుమానం రాదా. మీరు ఎలా గెలిచారని.. ? ఇక్కడ ఎవరు ఈవిఎం ఫిక్స్ చేశారని..?
పేల్చుకుంటున్నారు ఎందుకు ?
సిఎం: మేము 100 సీట్లు గెలుస్తామనుకున్నాం.. కానీ, 64 సీట్లకే పరిమితం అయ్యాం. మా అంచనా 100 సీట్లు వస్తాయనుకున్నాం. కానీ బిజెపి, బిఆర్‌ఎస్‌లు మాత్రం అటు, ఇటు అయిపోతుందని అనుకున్నాయి. అందుకే రాష్ట్రంలో ఈవిఎం మెషిన్‌ను ఎప్పుడంటే అప్పుడు ఆపరేట్ చేయవచ్చు. ఇది ఆటోమొటిక్ కాదు.

ప్రశ్న: మీరు బడే భాయ్‌పై పెద్ద ఆరోపణ చేస్తున్నారు ?
ముఖ్యమంత్రి: అవునా….మీ డబ్బులు బ్యాంక్ లో ఉన్నాయ్. బ్యాంక్‌లో నుంచి సక్కగా మీ జేబులో రావు కదా. మీరు బ్యాంక్‌కు వెళ్లాలి. సంతకం చేయాలి. రశీదు తీసుకోవాలి. చెక్ తీసుకోవాలి. అప్పుడు పైసలొస్తాయి. నరేంద్ర మోడీ కూడా అవసరమున్నప్పుడే ఈవిఎంను ఉపయోగిస్తారు.
ప్రతిసారి ప్రతి చిన్న వాటికి ఈవిఎం ఉపయోగించరు కదా.
ప్రశ్న: తెలంగాణ అంటే చిన్న రాజ్యమా…?
పేల్చుకుంటున్నారు ఎందుకు ?
సిఎం: అవును ప్రధాని మోడీకి అది చిన్న రాజ్యమే కదా. ! ఒక ప్రధానికి ఈ రాష్ట్రం చిన్నదే కదా. మోడీకి దక్షిణా భారతంపై అంత అవగాహన ఉండదు. మాదేమన్నా ఇతర దేశమా.. ? మేము దేశ వాసులం కాదా…? మీ ద్వారా నేను నరేంద్ర మోడీ.. అమిత్‌భాయ్‌ను అడగలనుకుంటున్నాను… ప్రధాని మీ వారే, గృహమంత్రి మీ వారే. రాష్ట్రపతి మీ వారే. రక్షణ మంత్రి అక్కడి వారే. పట్టణాభివృద్ధి మంత్రి మీ వారే. గ్రామీణాభివృద్ధి మంత్రి మీ వారే. అన్నీ పదవులు ఉత్తరాది వారికేనా? ఆర్థిక మంత్రి రాజ్యసభలో ఉత్తర్ ప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అందుకే నేను చెబుతున్నా. కాంగ్రెస్ హయం లో ప్రధాని ఉత్తర భారత దేశం నుంచి ఉంటే దక్షిణ భారత నుంచి రాష్ట్రప్రతిని ఎన్నుకునేవారు. అందుకే సౌత్ నుంచి ఎక్కువమంది రాష్ట్రపతులు అయ్యారు. ఆ విధంగా మోడీ ఎప్పుడైతే పగ్గాలు చేపట్టారో సౌత్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.
ప్రశ్న:మీ అభిప్రాయం ప్రకారం రాష్ట్రపతి హోదాలో ద్రౌపతి ముర్ము ఒడిశా నుంచి వచ్చారు. అది సౌత్ వాళ్లకు నచ్చడం లేదా. ?

పేల్చుకుంటున్నారు ఎందుకు ?
సిఎం: కాదు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ సౌత్‌లో 130 పార్లమెంట్ సీట్లు ఉన్నాయ్. వాటిలో ఎంతమందికి కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. తెలుగు ఎంపిలు 42 మంది ఉన్నారు. కానీ, మనకు దక్కింది ఒకే ఒక్క మంత్రి పదవి. గుజరాత్‌లో 26 మంది ఎంపిలు ఉన్నారు. వారికి 7 మంత్రి పదవులు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి బిజెపికి 62 ఎంపిలు ఉన్నారు. వారికి 12 మంత్రి పదవులు ఇచ్చారు ఇదేమిటి. ?
ప్రశ్న: అయితే బిజెపికి సంబంధించి ఎంతోమంది కర్ణాటక నుంచి ఉన్నారు కదా…?
పేల్చుకుంటున్నారు ఎందుకు ?
సిఎం: ఇక్కడ నలుగురు ఉన్నారు. ఒక్కరికే ఇచ్చారు. పక్కన ఆంధ్రప్రదేశ్‌లో రాజ్య సభ సభ్యులు ఉన్నారు. వారికి ఇవ్వలేదు. నేను కాంగ్రెస్ పార్టీ ఎంపికో మరొకరికో ఇవ్వమని అడగడం లేదు. బిజెపికి చెందిన సొంత పార్టీ వాళ్లకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వడం లేదని అడుగుతున్నా. ప్రధాని మోడీ సౌత్‌ను సెకండ్ గ్రేడ్ సిటిజన్ మాదిరిగా చూస్తున్నారు.
ప్రశ్న: ఉత్తర భారత్‌లో, గో మూత్ర రాష్ట్రాల్లో బిజెపి గెలుస్తుంది, ఇక్కడ కాదు, అయితే భారత్ దేశాన్ని ఎవరు రెండు ముక్కలు చేస్తున్నారు.. ?

పేల్చుకుంటున్నారు ఎందుకు ?
సిఎం: మోడీ చేస్తున్నారు..
ప్రశ్న: అదెలా సాధ్యం ?
పేల్చుకుంటున్నారు ఎందుకు ?
సిఎం: ఇక్కడ తెలంగాణ కోసం ఆంధ్రకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఎందుకు జరిగింది. ఎందుకంటే వారు మా హక్కులను కాలరాస్తున్నారు. మా వనరులు దోచుకుంటున్నారు. అందుకే పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. రానున్న రోజుల్లోనూ నరేంద్ర మోడీ ఇలాగే చేస్తే సౌత్, -నార్త్‌ల పేరుతో గొడవలు వస్తాయి.

 

 

 

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News