సమ్మె ఆలోచన వీడండి చర్చలకు వస్తే చేయగలిగింది
చేస్తాం పదేళ్లు ఆర్థిక ఉగ్రవాదం జరిగింది కెసిఆర్ కపట
నాటక సూత్రధారి..నమ్మొద్దు మేడే వేడుకల్లో సిఎం వ్యాఖ్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్టీసి కార్మికులు పంతాలకు, పట్టింపులకు వెళ్లొద్దని, సమ్మె ఆలోచ న వీడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశా రు. తాము అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడిప్పుడే ఆర్టీసి లాభాల బాటలో ప యనిస్తోందని ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రేరేపితంతో కడుపు మంటతో, అసూయతో విష పు మాటలు నమ్మి కార్మికులు సమ్మె బాట పడితే మొత్తం ఆర్టీసి సంస్థనే దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చించాలని, తాము చేయగలిగింది చేస్తామని ఆయన హామినిచ్చారు. రవీంద్ర భారతిలో జరుగుతున్న మేడే వేడుకల్లో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రానికి వచ్చే ఆదాయ లెక్కలన్నీ మీ ముందే ఉంచుతా..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంస్థ మీది అని, గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసి కా ర్మికులు సమ్మె చేస్తే బిఆర్‌ఎస్ పార్టీ 50 మంది కా ర్మికులను పొట్టనపెట్టుకుందని సిఎం రేవంత్ ఆ రోపించారు. కానీ, మీతో మాట్లాడలేదన్నారు. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒక్కటేనని రాష్ట్రానికి వచ్చే ఆదాయ లెక్కలన్నీ మీ ముందే ఉంచుతానని, ఏ పథకం ఆపాలో ఏ పథకం ఆపకూడదో మీరే చెప్పాలని ఆయన సూచించారు. రా ష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కార్మిక సోదరులందరూ సహకరించాలన్నారు. ఇక, ఒక సంవత్సరం అయితే కుదురుకుంటామని తెలిపారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ విధానమన్నారు.
గిగ్ వర్కర్స్‌కు నూతన విధానం
రాష్ట్ర సాధనలో అన్ని వర్గాల కార్మికులు భాగస్వాములయ్యారని, ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసి, వి ద్యుత్ కార్మికల పాత్ర మరువలేనిదని సిఎం రే వంత్ పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే తమ ప్ర భుత్వ విధానమని సిఎం అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సింగరేణి, ఆర్టీసిలో కారుణ్య ని యామకాలను సులభతరం చేశామన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కార్మికులందరూ సహకరించా ల న్నారు. గత ప్రభుత్వం అంఘటిత కార్మికులను ప ట్టించుకోలేదని ఆయన విమర్శించారు. చనిపోయి న కార్మికుల పట్ల కనీసం మానవత్వంతో వ్యవహారించలేదని ఆయన ధ్వజమెత్తారు. సింగరేణి ఔట్ సోర్సింగ్ సిబ్బందికి బోనస్ ఇచ్చిన తొలి ప్రభు త్వం తమదేనని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమా కల్పించామన్నారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా గిగ్ వర్కర్స్‌కు నూత న విధానం తీసుకురాబోతున్నామన్నారు.
గల్ఫ్ కార్మికులు మృతిచెందితే..
గల్ఫ్ కార్మికులు అక్కడ చనిపోతే వారి మృతదేహాలను కూడా గత ప్రభుత్వం తీసుకురాలేని పరిస్థితి ఉండేదని ఆయన ఆరోపించారు. కానీ, తాము అ ధికారంలోకి వచ్చాక వారి మృతదేహాలను తీసుకురావడమే కాకుండా వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నామన్నారు. తాము అ ధికారంలోకి రాకముందే సర్పంచుల పదవీ కాలం ముగిసిపోయింది. సర్పంచ్‌లకు ఈరోజు బకాయిలు ఉన్నాయంటే దానికి కెసిఆరే కారణమని ఆయన ఆరోపించారు.
కపట నాటక సూత్రధారి కెసిఆర్..
పదేళ్లు ఏమీ చేయని కమట నాటక సూత్రధారి కెసిఆర్ మళ్లీ బయటకు వచ్చారని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సిఎం చెప్పారు. వ రంగల్ సభలో కెసిఆర్ శాపనార్ధాలు పెడుతున్నార ని, పిల్లి శాపనార్థాలకు ఉట్టి కూడా తెగిపడదన్న విషయాన్ని కెసిఆర్ గుర్తుంచుకోవాలన్నారు. కెసిఆర్ చేసిన దోపిడీని ప్రజలు మర్చిపోలేదన్నారు. న న్ను నమ్మండి 20 ఏళ్లు మీకు అండగా ఉంటానని సిఎం రేవంత్ హామీనిచ్చాఉ. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం జరిగిందని, కెసిఆర్ కుటుంబానికి ఎ లా వేల కోట్లు వచ్చాయో చెప్పాలని ఆయన డి మాండ్ చేశారు. కెసిఆర్ రూ. 8.15 లక్షల కోట్లు అప్పు చేసి పదవి దిగి వెళ్లిపోయారని, ఆయన చే సిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు రూ. 1.58 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందఅన్నారు.
తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టామని సి ఎం రేవంత్‌రెడ్డి తెలిపారు .ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో కూడా ఇది జరగలేదని, ఇ ది తన చాలెంజ్ అని తమతో పోటీ పడాలని ఆయ న బిజెపి నాయకులకు సవాల్ విసిరారు. ఇంత చే సినా ఇది సరిపోదని రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి మరికొంత సమయం కావాలని ఆయన సూచించారు.
రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు రా ష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన దేశానికి ఆదర్శం గా మారిందన్నారు. తెలంగాణ కులగణన చేసినట్లుగా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించిందంటే దీనికి కారణం కార్మికులందరూ తెలంగాణలో తెచ్చుకున్న ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే అని ఆయన తెలిపారు. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.