Monday, April 29, 2024

లా కమిషన్‌కు తమిళనాడు సిఎం లేఖ

- Advertisement -
- Advertisement -

చెన్నై : కేంద్ర ప్రతిపాదిత ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి)ని తాము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం లా కమిషన్ ఆఫ్ ఇండియాకు లేఖ పంపించారు. యుసిసిని తీసుకురావడం ఇప్పుడు చివరికి పెళ్లికి తద్దినానికి ఒకటే మంత్రం బాపతుగా ఉందని స్పందించారు. యుసిసితో భారతీయ సమాజంలోని వైవిధ్య బహుళ సామాజిక వ్యవస్థలకు పలు సవాళ్లు ఏర్పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సివిల్‌కోడ్ ఆలోచన అమలు గురించి తమిళనాడు ప్రభుత్వం తరఫున తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నామని ఈ లేఖలో తెలిపిన స్టాలిన్ , భారతీయ సమాజానికి ఇది రుచించే ప్రక్రియ కాబోదని, ఏదో సమస్య ఉందని అవాంఛనీయ మార్గం వెతుక్కోవం సరికాదన్నారు. కొన్ని నిర్థిష్ట సంస్కరణలు అవసరం అనేది వేరే విషయం, దీనిని తాము అర్థం చేసుకుంటామని, కానీ ఈ ప్రతిపాదన పరిష్కారం కాదని స్పష్టం చేశారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తలపెట్టిన యుసిసిపై ఈ మధ్యలో ప్రధాని మోడీ మధ్యప్రదేశ్‌లో చేసిన వ్యాఖ్యలు పలు రకాలుగా పార్టీల నుంచి స్పందనలకు దారితీశాయి. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దీనిని వ్యతిరేకించారు. దేశం లౌకిక వాదంతో ఉన్న దేశంగా ఉందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 మేరకు మైనార్టీల హక్కుల పరిరక్షణకు భరోసా కల్పించారని స్టాలిన్ తమ లేఖలో తెలిపారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం గిరిజన ప్రాంతాలలోని వారి ఆచార వ్యవహారాలు , వారి సాంప్రదాయాలు, గుర్తింపుల పరిరక్షణ కీలకం అని పేర్కొన్నారని దీనిని గుర్తుంచుకోవాలని సూచించారు. సమాజంలోని సామాజిక ఆర్థిక వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోకుండా సివిల్ కోడ్‌ను అమలులోకి తీసుకురావాలనుకోవడం ప్రతికూల ఫలితాలకు దారితీస్తుందని స్టాలిన్ చెప్పారు.

యుసిసిని బలవంతంగా తీసుకురావడం జరిగితే ఇది చివరికి మతపరమైన వ్యవహారాల్లోకి ప్రభుత్వ అధికారపరమైన జోక్యంగా భావించుకోవల్సి వస్తుంది., దీనితో ఇతరత్రా పలు పరిణామాలు ఉంటాయి. చివరికి వ్యక్తుల స్వేచ్ఛను హరించే క్రమానికి దారితీస్తుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News