Sunday, April 28, 2024

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కష్టాలే

- Advertisement -
- Advertisement -

మరిపెడ : వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని, తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం తొమ్మిదేళ్ల కాలంలో అనేక వసతులు కల్పిస్తే జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్ అవసరం లేదని అన్నదాతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, రైతులపై వివక్ష చూపడం మానుకోవాలని జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మన్, మరిపెడ జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు ఆదేశాల మేరకు గురువారం మండలంలోని తానంచర్ల 33 కెవి సబ్ స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా శారధా రవీందర్ మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటలు అవసరం లేదని, 3 గంటలు ఇస్తే సరిపోతుందని రేవంత్‌రెడ్డి చెప్పడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రైతులు తీవ్ర విద్యుత్ కోతలు చూశారన్నారు. తెలంగాణ రైతులకు ఉచిత విద్యుత్ ఊపిరిలాంటిదని.. రైతుల ఊపిరిని ఆపేస్తామని, రైతుల ఉసురు తీస్తామని చెప్పడం కాంగ్రెస్ రాక్షస బుద్దికి నిదర్శనమని అగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో రైతు అన్ని విధాలా బాగుండాలనే తపనతో సిఎం కెసిఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. 24 గంటల ఉచిత విద్యుత్, పంటలకు పెట్టుబడి, సాగునీటి వసతులు చూసి యావత్ దేశమే అబ్బురపడుతున్నదని అన్నారు. రైతుల పక్షపాతి సిఎం కెసిఆర్ అని కొనియాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్ పని చేస్తుంటే బిజెపి వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే, కాంగ్రెస్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దని రైతుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.

రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌కు త్వరలో రైతులు, ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు రావుల వెంకట్‌రెడ్డి, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు తేజావత్ రవీందర్‌నాయక్, సర్పంచ్‌లు దిగజర్ల శ్వేత ముఖేష్, భూక్యా రమారెడ్యానాయక్, తేజావత్ జముకు, తేజావత్ పోరీ, బానోతు దేవిక శ్రీను, ఆర్‌బిఎస్ కోర్డినేటర్ పాదూరి రాంచంద్రారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు సీత వెంకన్న, భూక్య రఘు, ఉప సర్పంచ్ బిచ్చా, నాయకులు సీత భద్రయ్య, కాశ్యానాయక్, శంకర్, బాలాజీ నాయక్, యాసారపు లింగయ్య, గంగాధర్, విక్రమ్, అంజి, వెంకన్న, మదార్, జి.శంకర్, ఉమ్మడి తానంచర్ల గ్రామ పంచాయితీ నాయకులు, గ్రామపార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News