Saturday, August 9, 2025

గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఏజెన్సీ అంటే మనస్సు ఉండే ప్రజలకు నిలయం అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. ఆదివాసీలకు కల్మషం ఉండదని, ఏజెన్సీ ప్రాంతానికి వస్తే తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లా పాడేరు గ్రామంలో సిఎం మీడియాతో మాట్లాడుతూ..స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జివొ తీసుకువచ్చారని తెలియజేశారు. ఒకసారి వైసిపి, ఒకసారి కాంగ్రెస్ ఆ జివొను నిలిపివేశాయని విమర్శించారు. గిరిజనులకు కూటమి ఎప్పుడూ అండగా ఉంటుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆ జివొను పునరుద్ధరించామని అన్నారు.

పేదలను సర్వనాశనం చేయడానికే వైసిపి పార్టీ పుట్టిందని మండిపడ్డారు. తాము చెప్పినట్టు పెన్షన్ లు పెంచి ఇచ్చామని, గిరిజనులకు రూప్ టాప్ సోలార్ (Roop top solar tribals) అందిస్తామని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని అన్నారు. ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని, ఎన్నికష్టాలున్నా హామీలు నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో 5 మల్లీ స్పెషాల్టీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని, అరకు కాఫీకు బ్రాండ్ తీసుకువచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News