Friday, August 8, 2025

పిడుగుపాటుకు మినీ ఎత్తిపోతల నేలమట్టం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గం, పెంట్లవెల్లి మండల పరిధిలోని మెరుపులు ఉరుములతో కూడిన వర్షానికి పిడుగు పడింది. పిడుగుపాటుకు ఎంగంపల్లి తండా గ్రామ సమీపంలో కృష్ణ్ణానది తీరాన నిర్మించిన ఎత్తిపోతల పథకం పైపులైన్ దిమ్మెలు నేలమట్టం అయ్యాయి. ఈ మినీ ఎత్తిపోతల పథకాన్ని 1994లో నిర్మించారు. దీని ద్వారా ఎంగంపల్లి తండా మల్లేశ్వరం మంచాలకట్ట కొన్ని గ్రామాలకు దాదాపుగా 650 ఎకరాలకు సాగునీరు సరఫరా జరిగేది. ఎత్తిపోతల పథకం నిర్మించిన మొదలు కొన్నేళ్లపాటు ఉపయోగంలో ఉన్నా చాలాకాలం నుంచి మోటార్లు రిపేరు అయ్యాయనే నెపంతో నిరుపయోగంగా మారి శిథిలావ్యవస్థకు చేరింది. దీనిని మరమ్మతులు చేపట్టి, మళ్లీ ఉపయోగంలోకి తీసుకురావాలని రైతులు ఎంతో కాలం నుంచి కోరుతునన్నారు. కృష్ణానది చెంతన ఉన్న సాగుకు నీరు అందక రైతులు మాజీ ఎంఎల్‌లకు, ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావుకి వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఎత్తిపోతలపై రైతన్నలు ఆశలు వదులుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News