Sunday, May 19, 2024

నటుడు సునీల్‌కు అస్వస్థత…

- Advertisement -
- Advertisement -

Sunil

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు, స్టార్ కమేడియన్ సునీల్ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం సునీల్ కు వైద్యులు చికిత్సనందిస్తున్నారు. దీంతో ఆయన అభిమానునలు ఆందోళన చెందుతున్నారు. సునీల్ కు గొంతు ఊపిరితిత్తులో ఇన్ ఫెక్షన్ కారణంగా సునీల్ ఆస్పత్రిలో చేరానని,  తన ఆరోగ్యం గురించి ఎటువంటి వదంతులు నమ్మవద్దని సునీల్ స్పందించారు. కాగా, ప్రస్తుతం సునీల్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించిచారు. ఆయనకు పలువురు తెలుగు సినీ ప్రముఖులు పరామర్శించారు. సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్‌ డైరెక్షన్ లో వచ్చిన ”అల వైకుంఠపురంలో” సిన్మాలో సునీల్ నటించారు. ఆయన తాజాగా నటించిన రవితేజ చిత్రం ‘డిస్కో రాజా’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Comedian Sunil Joins in Hospital over Illness

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News