Saturday, May 10, 2025

కుటుంబ ప్రేక్షకులను మైమరపించిన ‘శుభం’

- Advertisement -
- Advertisement -

సినిమా కథః భీమునిపట్నం అనే ఊరిలో కేబుల్ టీవీ బిజినెస్ నడిపే కుర్రాడు శ్రీనివాస్ (హర్షిత్ రెడ్డి). అతడికి శ్రీ వల్లి (శ్రియ కొం తం) అనే అమ్మాయితో పెళ్లవుతుంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయితో తొలి రాత్రి ని మధురంగా మార్చుకోవాలని భావించిన అతడికి చేదు అనుభవం ఎదురవుతుంది. తనకే తెలియకుండా ఒక సీరియల్‌కు బానిసగా మా రిన శ్రీవల్లి.. భర్తకు చుక్కలు చూపించేస్తుంది. శ్రీవల్లి ఎందుకిలా ప్రవర్తిస్తోం దో అర్థం కాక తన స్నేహితులకు విష యం చెబితే.. వాళ్ల భార్య లు కూడా ఇలాగే వింతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఊరిలో ఆడవాళ్లందరూ ఒక సీరియల్ చూస్తూ తమ ఇంట్లో వాళ్లకు చుక్కలు చూపిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇంతకీ ఆ ఊరి ఆడవాళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారు.. వారికి ఆ సీరియల్ కు ఉన్న కనెక్షన్ ఏంటి.. ఈ సమస్యను ఆ ఊరి వాళ్లు ఎలా పరిష్కరించుకున్నారు.. అన్నది మిగతా కథ.
విశ్లేషణః టీవీ సీరియళ్లు నడిచే తీరు.. సన్నివేశాల్లోని అతి, విపరీతమైన సాగతీత మీద కౌంట ర్లు వేస్తూ కామెడీ చేయడం ఇప్పుడు సినిమాల్లోనూ ఒక ట్రెండ్‌గా మారింది. అయితే సమం త ప్రొడక్షన్‌లోని తొలి చిత్రమైన ‘శుభం’ లో ఈ కామెడీనే అసలు కథగా మార్చి రెండు గంటలు నవ్వుల్లో ముంచెత్తుదామని ప్రయత్నించారు రచయిత వసంత్ మరిగంటి-, దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల. ఈ ప్రయత్నంలో వాళ్లు సఫలీకృతమై ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. వాళ్లు ఎంచుకున్న పాయింట్ క్రేజీగా అనిపిస్తుంది. సినిమాలో కామెడీ కూడా బాగానే వర్కవుట్ చేయగలిగారు. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీని దర్శకుడు చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. క్లీన్ కామెడీతో సాగే కథనం కుటుంబ ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. సినిమాలో ఫన్ మూమెంట్స్ మాత్రమే కాకుండా ఆకట్టుకునే బ్యూటిఫుల్ ఎమోషన్స్, భార్య భర్తలపై కొన్ని అర్థవంతమైన సన్నివేశాలు చాలా బాగున్నాయి.

అలాగే అక్కడక్కడా హారర్ సీన్స్ కూడా ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతిని అందిస్తాయి. ఇక నటీనటుల్లో మొత్తం అంతా కూడా బాగా చేశారని చెప్పాలి. హర్షిత్ చాలా సహజంగా మంచి నటన కనబరిచాడు. అలాగే తన సరసన నటించిన శ్రియా కొంతం, హీరో ఫ్రెండ్స్‌గా నటించిన చరణ్ పెరి, శ్రీనివాస్ రెడ్డిలు తమ నటనతో ఆకట్టుకున్నారు. వారిపై పలు కామెడీ సీన్స్ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యాయి. ఇంకా వారి భార్యలుగా చేసిన శ్రావణి లక్ష్మి, షాలిని కొండెపూడి కూడా బాగా చేశారు. ఇక ఫైనల్ గా స్పెషల్ రోల్‌లో కనిపించిన రాగ్ మయూర్ అండ్ సినిమా బండి టీం ఎంట్రీ నుంచి కథనం మరింత ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇక సమంత కూడా చిన్న క్యామియోలో తన రోల్‌కి పూర్తి న్యాయం చేకూర్చారు. ఆమె తన నటనతో ప్రేక్షకులను మైమరపించారు. ఇక మొత్తానికి శుభం చిత్రం ఫ్యామి లీ ఆడియెన్స్‌ని బాగా అలరిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సీరియల్స్ చూసే మహిళా ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి వెళ్తే మాత్రం తప్పకుండా ఎంటర్‌టైన్ అయ్యి థియేటర్‌నుంచి బయటకి వస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News