Tuesday, April 30, 2024

అయ్య ‘భౌ’బోయ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వీధి కుక్కల బెడదపై జిహెచ్‌ఎంసికి ఫిర్యాదుల వెల్లువెత్తున్నాయి. వీధి కుక్కలతో బెంబేలెత్తుతున్న నగరవాసులు గంటల వ్యవధిలోనే వేల సంఖ్యలో జిహెచ్‌ఎంసికి ఫిర్యాదులు చేస్తున్నారు. 36 గంటలలో వీధి కుక్కల స మస్యలపైనే బల్దియా 15వేలకు పైగా ఫిర్యాదులు అందా యి. జిహెచ్‌ఎంసి హెల్ప్‌లైన్ నంబర్‌తో పాటు మై జిహెచ్‌ఎంసి యాప్, సిటిజన్ బడ్డీ, ట్విటర్ల తదితర సోషల్ మీడి యా ద్వారా గంటకు సగటున 416 ఫిర్యాదులు జిహెచ్‌ఎంసి అందుతుండడం నగరంలో వీధి కుక్కల తీవ్రతకు అద్దంపడుతోంది. అంబర్‌పేట్ ఛేనంబర్ చౌరస్తాలో 4 ఏళ్ల చిన్నారి వీధి కుక్కల దాడిలో మరణించిన ఘటన తర్వాత గడిచిన రెండు, మూడు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా కేవ లం వీధి కుక్కలకు సంబంధించి అత్యధిక ఫిర్యాదులు అం దుతున్నాయి. దీంతో ఇప్పటికే వీధి కుక్కల కట్టడికి చర్య లు తీసుకున్న జిహెచ్‌ఎంసి అధికారులు ప్రజల నుంచి అందుతున్న అన్ని ఫిర్యాదులపై సారిస్తున్నారు.

అయితే ఒక్కసారిగా వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండడం తో జిహెచ్‌ఎంసి అధికారులు తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు. ఈ ఫిర్యాదులను ఎలా పరిష్కారించాలి. ఎప్ప టిలోపు పరిష్కారిస్తామనే స్పష్టత వారికి కూడా లేకపోవడంతో అంతా అయోమయం నెలకొంది. జంతు జనన ని యంత్రణ (ఎబిసి)లో భాగంగా ప్రతి ఏటా కోట్లాది రూపాయాలు ఖర్చు పెడుతున్నా వీధి కుక్కల సమస్య ఇంత తీవ్రం కావడంతో అధికారులు కూడా ఏమి చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది, వాహనాలతో ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారానికి నెలలు పట్టే అవకాశం ఉండడంతో అధికారులకు చెమటలు పడుతున్నాయి. దీంతో ఫిర్యాదు సంఖ్య వేలల్లో పెరుగుతుండడం పరిష్కరిస్తున్న వాటి సంఖ్య వందల్లో ఉంటుండడంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్త అవకాశం ఉండడంతో జిహెచ్‌ఎంసి అధికారగణం జంకుతోంది. ఇన్ని రోజుల పాటు ఏమి పట్టనట్లుగా వ్యవహరించిన అధికారులకు వీధి కుక్కలకు సంబంధించి అందుతున్న ఫిర్యాదుల రూపంలో భయం పట్టుకుంది.

రోజుకు 300 ఫిర్యాదుల పరిష్కారం

వీధి కుక్కల సమస్యలపై నగరవాసుల నుంచి రోజువారీగా వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతుండగా జిహెచ్‌ఎంసి వందల సంఖ్యలో మాత్రమే వాటిని పరిష్కరిస్తోంది. గ్రేటర్‌లోని 6 జోన్ల పరిధిలో 30 సర్కిళ్ల ఉన్నవిషయం తెలిసిందే. అయితే వీధి కుక్కల సమస్యకు సంబంధించి గత మూడు, నాలుగు రోజులుగా ప్రతి సర్కిల్‌కు ప్రతి రోజు వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే జిహెచ్‌ఎంసి సిబ్బంది మాత్రం ప్రతి సర్కిల్‌లో కేవలం 10 ఫిర్యాదులను మాత్రమే పరిష్కరిస్తున్నారు. ఇలా రోజుకు గ్రేటర్ వ్యాప్తంగా 300 ఫిర్యాదులను పరిష్కరిస్తుండగా గంటలోపే 200 నుంచి 400 వరకు ఫిర్యాదు అందుతున్నాయి. దీంతో గ్రేటర్‌లో ఫిర్యాదు సంఖ్య గుట్టల్లా పెరిగిపోతోంది.

రోజుకు 150 కుక్కలకు శస్త్ర చికిత్సలు

నగరవాసుల నుంచి అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా వెటర్నరీ విభాగం అధికారులు వీధి కుక్కలను పట్టుకునే పనిలో నిమగ్నమైయ్యారు. ఆయా ప్రాంతాల్లో దొరికిన వీధి కుక్కలను పట్టుకుని వాటిని నగరంలో 5 జంతు సంరక్షణ కేంద్రాలకు సిబ్బంది తరలిస్తున్నారు. ప్రతి రోజు అక్కడ 150 కుక్కలకు శస్త్త్ర చికిత్సలు నిర్వహించి, వారం రోజుల తర్వాత వాటిని తిరిగి వదలివేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News