Thursday, May 2, 2024

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: రానున్న అసెంబ్లి ఎన్నికల దృశ్యా ఓటింగ్ పై ప్రజలకు అవగాహనను కల్పించే దిశగా జిల్లాలో విసృత్త ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి జిల్లా అధికారులు సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. సోమవారం వివిద రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కేంద్రం లోని ఈవియం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు.

ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న అసెంబ్లి ఎన్నికలను సజావుగా నిర్వహిం చే క్రమంలో జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జూన్ 22 నుండి జూలై 4వ తేది వరకు 12రోజుల పాటు జిల్లాలోని 2873 బ్యాలెట్ యూనిట్ లు, 2227 కంట్రోల్ యూనిట్లకు మరియు 2191 వివి పాట్ లకు ఎఫ్‌ఎల్సి నిర్వహించడం జరిగిందన్నారు.

ఇందులో 2807 బియులు, 2222 సియు లు, 2187 వివి పాట్ లు సక్రమంగా ఉండగా మిగిలిన 66 బియులు, 5 సియు లు, 4 వివిపాట్ లు రిజెక్ట్ అవడంతో వాటిని ఎఫ్.ఎల్.సి. అనంతరం గోడౌన్ లోని ప్రత్యేక గదిలో భద్రపరిచి గదిని సీల్ చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం నాడు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గదిని తెరిచి, రిజెక్ట్ అయిన వాటిని ఈసిఐఎల్, హైదరాబాద్ కు తరలించడం జరిగిందని అయన తెలిపారు.

జిల్లాలోప్రశాంతవాతావరణంలో ఎన్నికల నిర్వహణ, ఓటింగ్ పై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా జిల్లాలోని కరీంనగర్, మానకొండూర్, చోప్పదం డి, హుజురాబాద్ నియోజక వర్గాలలోని రిటర్నింగ్ అధికారులతో పాటు కలెక్టర్ కార్యాలయంలో మరియు మొబైల్ వాహనాల ద్వారా ఈవియం ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కోన్నారు.

తద్వారా జిల్లాలో ప్రజలకు ఓటింగ్ పై పూర్తి అవగాహనను కల్పించడంతో పాటు ఈసారి జరిగనున్న ఎన్నికలలో ఓటింగ్ పర్సంటేజిని పెంచేలా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయిం ట్ కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్, బిఎస్పి పార్టీ ప్రతినిధి గోలి అనీల్ కుమార్, సిపిఐ(యం) పార్టీ ప్రతినిధి యం. వాసుదేవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మోహనచారి, బిఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధి ఎస్. శ్రీనివాస్, టిడిపి పార్టీ ప్రతినిది వినిత్ లు, తహసీల్దార్లు సంబంధిత అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News