Monday, April 29, 2024

బిజెపి బండి సంజయ్‌ను తొలగించి బిసిలకు అన్యాయం చేసింది: రవీంద్ర నాయక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర పార్టీ అధ్యక్షత బాధ్యతల నుంచి ఎంపి బండి సంజయ్‌కుమార్ తొలగించడం అన్యాయమని ఆ పార్టీ సీనియర్ నేత రవీంద్ర నాయక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వరంగల్లో నిర్వహించిన ప్రధాని నరేంద్రమోడీ సభకు తనకు ఆహ్వానం అందలేని ఆవేదన వ్యక్తం చేస్తూ సభ కారణంగా తనకు అవమానం జరిగిందన్నారు.

సామాజిక న్యాయం, స్వాభిమానం, స్వయం పాలన కోసం తెలంగాణ పోరాటం చేసినట్లు చెప్పారు. కార్పొరేట్ దొంగలు దేశ సంపదను దోచుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి ఆధారాలు లేకుంటే విమర్శలు చేయడని, అవినీతికి పాల్పడే ముఖ్యమంత్రులపై సుమోటోగా కేసు నమోదు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశాడని, కానీ కేసీఆర్ దళితలను సీఎం చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి సీతక్కను సిఎం చేస్తానని చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి ఒక డైనమిక్ పీసీసీ చీప్ అని కొనియాడారు. బిసిల ఎదుగుతున్న సమయంలో బండి సంజయ్‌ను తప్పించడం సరికాదన్నారు. సంజయ్‌ని మరో బిసికి అధ్యక్ష పదవి ఇవ్వాల్సింది పోయి ఇతరులకు ఇవ్వడంపై పార్టీ పెద్దలపై మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News