Sunday, April 28, 2024

కృష్ణ, గోదావరి బోర్డుల పరిధులపై అయోమయం

- Advertisement -
- Advertisement -

Confused over scope of Krishna and Godavari boards

అసంపూర్తిగానే ముగిసిన ఉపసంఘాల సమావేశాలు

బోర్డుల పరిధిపై చర్చలో విరుద్ధ అభిప్రాయాలు వెల్లడించిన తెలుగు రాష్ట్రాలు
వాటి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తలపట్టుకున్న కృష్ణ, గోదావరి బోర్డుల ఉపసంఘాలు
పరిధుల నిర్ణయం తమ వల్ల కాదని చేతులెత్తేసిన వైనం
గెజిట్ అమలు గడువు 14తో ముగుస్తున్నందున అయోమయం
గెజిట్ అమలు తప్పదని స్పష్టం చేసిన బోర్డు సభ్యులు పిళ్లై

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టుల పరధిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ నోటిఫికేషన్ అమలు గడువు తరుముకొస్తొంది. మరోవైపు బోర్డుల పరిధి, చేర్పులు , మార్పులు , మినహాయింపులపై రెండు రాష్ట్రాలు చేస్తున్న ప్రతిపాదనలపై ఏకాభిప్రాయాలు కుదరటం లేదు. గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 14నుంచి అమల్లోకి రాబోతోంది. ఈ నేపధ్యంలో కృష్ణా, గోదావరి నదీయాజామన్య బోర్డులకు సంబంధించిన ఉప సంఘాలు ఆదివారం జలసౌధలో నిర్వహించిన సమావేశాలు అసంపూర్తిగానే ముగిశాయి. బోర్డుల పరిధిపై జరిగిన చర్చల్లో తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ అభిప్రాయాలను గట్టిగానే వెల్లడించాయి. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి చేర్చే అంశంలో జరిగిన చర్చలో ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తపరిచారు. అయితే ఒక రాష్ట్రం వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని మరో రాష్ట్రం అంగీకరించపోవటంతో రెండు రాష్టాల మధ్యన ఏకాభిప్రాయాలు కుదర్చటం తమ వల్ల కాదంటూ కృష్ణా, గోదావరి బోర్డుల ఉపసంఘాలకు చెమటలు పట్టాయి. ఒక దశలో ఇక బోర్డుల పరిధి నిర్ణయం తమ వల్ల కాదంటూ రెండు బోర్డుల ఉపసంఘాలు చేతులెత్తేశాయి.

గోదావరి బోర్డు పరిధికి పెద్దవాగు ఒక్కటిచాలు:

గోదావరి నదీపరివాహకంగా తెలగాణ రాష్ట్రం పరిధిలో గోదావరి బోర్డుపరిధిలోకి పెద్దవాగు ఒక్కటి చాలని తెలంగాణ రాష్ట్రం అధికారులు తేల్చిచెప్పారు. జలసౌధలో గోదావరి నదీయాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం బోర్డు సభ్యులు బి.పి పాండే అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ. ఎపి రాష్ట్రాలనుంచి నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు. గోదావరి నది పరివాహకంగా తెలంగాణ రాష్ట్రం పరిధిలో పెద్దవాగు ఒక్కటే గోదావరి బోర్డు పరిధిలోకి చేర్చాలని తెలంగాణ రాష్ట్ర అధికారులు సమావేశంలో తెలిపారు.తెలంగాణ అధికారులు చేసిన ప్రతిపాదనను ఎపి అధికారులు వ్యతిరేకించారు. శ్రీరాం సాగర్ నుంచి సీతమ్మ సాగర్ వరకూ ఉన్న ప్రాజెక్టులన్నింటినీ గోదావరి బోర్డు పరిధిలోకి చేర్చాలని తెలిపారు. సమావేశంలో పెద్దవాగుపైనే అధికంగా చర్చ జరిగింది.

ప్రాజెక్టు నిర్వహణ వ్యయం , ఆయకట్టు విస్తీర్ణం ్రప్రకారం నిర్వహణ వ్యయం భరించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బోర్డు అడిగిన సమాచాలను వెంటనే అందచేయాలని కార్యదర్శి పిళ్లే రెండు రాష్టాలకు సూచించారు. బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను చేర్చే అంశంలో ఉపసంఘంలో ఎవిధమైన నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో ఇక సోమవారం నాడు జరిగే బోర్డు సమావేశంలోనే ఈ అంశంపై చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చాకే నిర్ణంయ తీసుకోవాలని చెబుతూ ఉపసంఘం సమావేశాన్ని అసంపూర్తిగానే ముగించారు.

కృష్ణాబోర్డు పరిధిలోకి ఎత్తిపోతల పథకాలు వద్దు :

జలసౌధలో కృష్ణా నదీయాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శిపిళ్లై అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ , ఎపి రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం నుంచే వాడివేడిగా సాగింది. కృష్ణానది పరివాహకంగా తెలంగాణ ,ఎపి రాష్ట్రాల పరిధిలో నిర్మించిన ,నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి బోర్డు కోరిన వివరాలను ఇవ్వాల్సిందేనని పిళ్లై రెండు రాష్ట్రాల అధికారులకు నిక్కచ్చికగా తెలిపారు. ఈ నెల 14నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలు జరిగితీరుతుందని స్పష్టం చేశారు. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను చేర్చే అంశంలో రెండు రాష్ట్రాలనుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి.

తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఉన్న ఎత్తిపోతల పథకాలను బోర్డు పరిధిలోకి చేర్చాల్సిన అవసరం లేదని, ప్రాజెక్టుల హెడ్ వర్క్ , జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను చేర్చితే సరిపోతుందని తెలంగాణ రాష్ట్రం అధికారులు ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ అధికారులు ఏకభవించేలేదని సమాచారం. కృష్ణానది పరివాహకంగా జూరాల ప్రాజెక్టు నుంచి పులిచింతల ప్రాజెక్టు దాకా అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చాల్సిందేని స్సష్టం చేసినట్టు సమాచారం. ఉమ్మది ప్రాజెక్టుల వరకే బోర్డు పరిధిలోకి తీసుకోవాలని తెలంగాణ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఉపసంఘం తెలంగాణ , ఎపి అధికారుల ప్రతిపాదనలతో ఎటూ తేల్చలేక నిర్లిప్తతకు లోనైనట్టు సమాచారం. ప్రాజెక్టుల పరిధిపై మంగళవారం నాడు జరగనున్న కృష్ణానదీయాజమాన్య బోర్డు సమావేశానికే వదిలేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News