- Advertisement -
హైదరాబాద్: ముస్లింల రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బిసి ముసుగులో ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లు ఇచ్చే కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేసే ధర్నాకు బిసిల మద్దతు కరువైందని ఎద్దేవా చేశారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తేనే మద్దతు ఇస్తామని బండి ప్రకటించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా బిసిని ప్రధానిని చేశారా? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 48 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బిసినైనా సిఎం చేశారా? అని అడిగారు. మంత్రపదవులు, నామినేటెడ్ పదవులను బిసిలకు ఎన్ని ఇచ్చారని నిలదీశారు. కేంద్రంపై నెపం మోపి తప్పించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని బండి చురకలంటించారు.
- Advertisement -