మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నిక ల్లో గెలుపే లక్షంగా కేడర్‌కు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నే నేడు ఎల్బీ స్టేడియంలో గ్రామ స్థాయి నేతల సమ్మేళనానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ ఖర్గే సభకు ‘సామాజిక న్యా య సమర భేరీగా’ కాంగ్రెస్ వర్గాలు నామకరణం చేశా యి. నేడు మధ్యాహ్నాం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ సమ్మేళనం జరుగుతుంది. జైబాపు, జైంభీం, జై సంవిధాన్‌లో భాగంగా ఖర్గే సభ జరుగుతుందని పిసిసి వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా ఈ సమావేశానికి ఏఐసిసి నాయకురాలు,పార్టీరాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్, సిఎం రేవంత్‌రెడ్డి,
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు చేపట్టాల్సిన అంశాలు, పార్టీ కేడర్‌కు తీసుకోవాల్సిన పటిష్టత గురించి గ్రామస్థాయి నాయకులకు ఖర్గే సూచనలు చేయనున్నారు. పార్టీ గెలుపు కోసం విభేదాలను విడనాడి గెలుపే లక్షంగా ముందుకెళ్లాలని ఖర్గే కేడర్‌కు పలు సూచనలు చేయనున్నారు.