Wednesday, August 6, 2025

జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ మహాధర్నా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బిసి రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా చేపట్టింది. తెలంగాణలో  స్థానిక సంస్థల ఎన్నికలు- విద్య, ఉపాధి రంగాల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో బుధవారం ధర్నా చేపట్టంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేపట్టి ఆ లెక్కల ఆధారంగా రాష్ట్రంలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. వాటికి ఆమోదముద్ర వేయించాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు ముఖేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, కార్పొరేషన్ చైర్మన్లు, డిసిసి అధ్యక్షులు, బిసి సంఘాల నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News