Tuesday, April 30, 2024

జీ 20లోగోలో బీజేపీ రంగులు.. కమలం గుర్తు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జీ 20 దేశాల సమావేశానికి వచ్చే ఏడాది భారత్ అధ్యక్షత వహించనున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన జీ 20 లోగోలో బీజేపీ జెండా రంగులు, కమలం గుర్తు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దీనిపై మండిపడింది. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఇలాంటి చర్యను తిరస్కరించారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ గుర్తు చేశారు. 70 సంవత్సరాల కిందట కాంగ్రెస్ జెండాను భారత దేశ జెండాగా చేయాలనే ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారని తెలిపారు. అయితే ఇప్పుడు జీ 20 అధ్యక్ష పదవికి బీజేపీ ఎన్నికల గుర్తు అధికారిక చిహ్నంగా మారిందని జైరామ్ రమేష్ విమర్శించారు.

ఇది దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ సిగ్గు లేకుండా తమను ప్రమోట్ చేసుకునే ఏ అవకాశాన్ని వదులుకోరన్న సంగతి ఇప్పుడు మనకు తెలిసిందని జైరామ్ రమేష్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. మరోవైపు తమ చర్యను సమర్థించుకునేందుకు బీజేపీ వితండ వాదానికి దిగింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజార్ పూనావాల్ ట్విట్టర్‌లో ఒక పోస్టు చేశారు. కాంగ్రెస్ నీనియర్ నేత కమల్‌నాథ్ పేరు నుంచి కమల్‌ను తొలగిస్తారా ? అని ప్రశ్నించారు. కమలం మన జాతీయ పుష్పమని, అంతేకాక లక్ష్మీదేవి ఆసనమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News