Thursday, May 2, 2024

సోనియా గాంధీకి ఈడీ సమన్లపై కాంగ్రెస్ కార్యకర్తల నిరసన

- Advertisement -
- Advertisement -

 

Sonia Gandhi

న్యూఢిల్లీ: ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. దేశంలోనే తొలిసారి ధర్నాను అడ్డుకోవడం ఇదే తొలిసారి అని గెహ్లాట్ అన్నారు. ‘‘దేశంలో ఏజన్సీల దుర్వినియోగం జరుగుతోంది… ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం మన హక్కు, కానీ అది కూడా నశించిపోతోంది…’’ అని అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. ‘ఈడీ దుర్వినియోగం ఆపండి’ అంటూ పెద్ద పెద్ద బ్యానర్‌లు పట్టుకుని, సోనియాను ఈడీ ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ కాంప్లెక్స్ లోపల కూడా నిరసన మార్చ్  నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News