Thursday, May 2, 2024

అధునాతన పద్దతి తో 30 పడకల ఆస్పత్రి నిర్మాణం

- Advertisement -
- Advertisement -

ఇల్లంతకుంట: అధునాతన పద్దతితో, అన్ని సౌకర్యలతో ఇల్లంతకుంట మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని, ఆస్పత్రి ఏర్పాటు కోసం మంత్రి కేటిఆర్ బర్త్ డే గిఫ్ట్ గా రూ.9కోట్లు మంజూరు చేశారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. నిధుల మంజూరుపై మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, హరీశ్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. అనంతరం ఎమ్మెల్యే రసమయి విలేకరుల తో మాట్లాడుతూ మండల ప్రజలకు ఇచ్చిన మాట తూచ తప్పకుండా నేరవేర్చామన్నారు.

ఎన్నో ఎండ్లుగా 30 పడకల ఆస్పత్రి కోసం ప్రజలు ఎదురు చూశారని, ఇప్పుడు మంత్రి కేటిఆర్ హామీ నేరవేర్చడన్నారు. అధునాతన సంకేతిక పరిజ్ఞానంతో రూ.9 కోట్లతో 30 పడకల ఆస్పత్రి నిర్మాణం చేస్తామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని గగ్గోలు పెట్టిన, రాజకీయ లబ్ధ్దికోసం ప్రభుత్వం పై విమర్శలు చేసిన అభివృద్ధ్దిని మాత్రం అడ్డుకోలేవన్నారు.

ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం కోసం సర్వేలు జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుందన్నారు. మంజూరుకు కృషి చేసిన సిఎం కెసిఆర్, మంత్రులు హరీశ్ రావు, కెటిఆర్‌కు రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పివైస్ చైర్మన్ సిద్దంవేణు, ఎంపిపి వుట్కూరివెంటక రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, పల్లే నర్సింహారెడ్డి, సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మీ బాలరాజు, ఎంపిటిసి వొగ్గు నర్సయ్య యాదవ్, వైద్యులు శరణ్య, కట్ట రమేష్, మాజీ ఎంపిపి ఐలయ్య, తీగల పుష్పలత, ఎలుక పద్మ, ఎండి సలీం, దమ్మని మధు, రఘు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News