Monday, May 13, 2024

మేరులను బిసి- ఏ లోకి మార్చండి

- Advertisement -
- Advertisement -

మంత్రి పొన్నంకు మేరు కులస్తుల వినతి

మన తెలంగాణ / హైదరాబాద్ : స్వాంతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా చేనేత కార్మికుల అనుబంధమైన మేరు దర్జీ కులస్తుల విషయంలో కేంద్ర చేనేత, జౌళి శాఖ ఉదాసీన వైఖరిని అవలంభిస్తోందని మేరు యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పోల్కం శ్రీనివాస్ మేరు, ప్రధాన కార్యదర్శి ఆదిమూలం శంకర్‌లు ఆరోపించారు. ఈ మేరకు రవాణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా మేరు కుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మనిషీ జీవితంలో కూడు, గుడ్డ , గూడు ఎంత ముఖ్యమో చేతి వృత్తులలోనూ మేరు (దర్జీ ) వృత్తి అంతే ముఖ్యమైనదన్నారు. దర్జీ పని లేనిదే మానవుడికి మనుగడనే లేదన్నారు. ఇంత కీలకమైన వృత్తిలో పని చేస్తున్న తమ మేరు కులాన్ని బిసి ఏ కేటగిరిలో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం తమను బిసి డిలో ఉంచారని అది కరెక్ట్ కాదన్నారు. పూర్వం అంగట్లో మిల్ నుండి వచ్చే బట్టలను అక్కడికక్కడే చింపి కుట్టి ఇచ్చే వాళ్లమని దీంతో తమకు ‘చిప్పోలు’ అని కులసర్టిఫికెట్ ఇస్తు వస్తున్నారని అది తప్పు అన్నారు. నేటి ఆధునిక యుగంలో ..రేడీమేడ్ వస్త్ర మిల్లులు వచ్చి తమ దర్జీలకు జీవనోపాధి లేకుండా చేశాయన్నారు.

దీనిపై గత ప్రభుత్వాలకు ఎన్నో సార్లు చెప్పినా విస్మరించాయన్నారు. అంతే కాకుండా గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం తమ మిత్ర పక్ష పార్టీ మెప్పుకోసం 20 వేల కుట్టు మిషన్లను ముస్లిం మైనారిటీలకు రంజాన్ సందర్భంగా ఇచ్చి దర్జీలమైన తమను విస్మరించిందని పోల్కం శ్రీనివాస్ మేరు, ఆదిమూలం శంకర్‌లు ఆరోపించారు. తమ కులానికి బిఆర్‌ఎస్ అన్యాయం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు యూనిఫాంలను కుట్టే అవకాశం తమ కులానికి మాత్రమే ఇవ్వాలని, మేరు కులానికి ఫెడరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నంను కలిసిఇంకా ఈ కార్యక్రమంలో గంగాపురం దశరథ్, రైతు సంఘం చౌటుప్పల్ మండలం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, పోల్కం వినయ్ రాజ్, మునగాల రమేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News