Tuesday, April 30, 2024

స్వచ్ఛ సర్వేక్షన్‌కు సహకరించాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ – 2023కి జిల్లా, మండల అధికారులు సమన్వయంతో పని చేసి సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ సూచించారు. ఆదివారం రామడుగు మండలంలోని రాంచంద్రపూర్, గోపాల్‌రావుపేట గ్రామాలను యూనిసెఫ్ రాష్ట్ర ప్రతినిధులు వెంకటేష్, కాశీనాథ్‌లతో కలిసి పరిశీలించారు.

రాంచంద్రాపూర్‌లో అంగన్‌వాడీ కేంద్రంలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో జరిగిన టాయిలెట్ మరమ్మత్తు పనులను పరిశీలించి వెంటనే అక్కడ అంగన్‌వాడీ కేంద్రం నడిచేలా సూచించారు. గోపాలరావుపేట గ్రామంలో జీపీ కార్యాలయం, పలు నివాస గృహాలను పరిశీలించారు. రామడుగులో నర్సరీ వద్ద డ్రాగన్ పూప్ట్ మొక్కల పెంపకం చూసి పంచాయతీ కార్యదర్శి రేవంత్‌రెడ్డిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, ఎంపీడీవో భాస్కరరావు, యూనిసెఫ్ సమన్వయ కర్త కిషన్‌స్వామి, సర్పంచ్‌లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News