Saturday, July 27, 2024

లంచం అడిగితే ఫోన్ చేయండి: సిపి అంజనీకుమార్

- Advertisement -
- Advertisement -

Corrupt officials

 

లంచం అడిగితే 9490616555 ఫోన్ చేయండి
మొబైల్ నంబర్ ఇచ్చిన నగర సిపి అంజనీకుమార్
జూబ్లీహిల్స్ ఇన్స్‌స్పెక్టర్, ఎస్సై సస్పెన్షన్

హైదరాబాద్ : అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఏ పోలీసు అధికారైనా లంచం అడిగితే తమకు ఫోన్ చేయాలని 9490616555కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. స్టేషన్ బెయిల్ కోసం బాధితుడి నుంచి రూ.50,000 తీసుకుంటూ జూబ్లీహిల్స్ ఎస్సై సుధీర్ రెడ్డి పట్టుబడిన విషయం తెలిసిందే. ఇన్స్‌స్పెక్టర్ బల్వంతయ్య ఆదేశాల మేరకు డబ్బులు తీసుకున్నానని సుధీర్ రెడ్డి చెప్పిడంతో ఎసిబి అధికారులు ఇన్స్‌స్పెక్టర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో అవినీతిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎసిబి అధికారులు పరారీలో ఉన్న ఇన్స్‌స్పెక్టర్ బల్వంతయ్య కోసం గాలిస్తున్నారు. అతడి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది.

Corrupt officials should be punished
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News