Friday, May 3, 2024

మోడీ చెబుతున్నట్లు దేశం వెలిగిపోవడం కాదు.. కార్పొరేటర్లు వెలిగిపోతున్నారు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. బాల మల్లేశ్

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నట్లు దేశం వెలిగిపోవడం కాదని కార్పొరేట్లు వెలిగిపోతున్నారని తెలంగాణ వ్యవసాయక కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. బాల మల్లేశ్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ హిమాయత్ నగర్ లో కలకొండ కాంతయ్య అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం సమితి సమావేశంలో ఎన్ బాల మల్లేశ్  పాల్గొని ప్రసం గించారు. ఆయన తన ప్రసంగము కొనసాగిస్తూ దేశంలోని కార్పొరేట్ శక్తులు అంబానీ, ఆదానీలు వెలిగిపోతున్నారు కానీ దేశంలోని కూలీలు, కార్మికులు, కర్షకులు వెలిగిపోవడం లేదని విమర్శించారు.

మరోవైపున కార్మికులు రైతులు విద్యార్థులు, మహిళలు, యువకులు అణిచివేత పేదల మైనార్టీల ఆదివాసుల హక్కులను హరించడం జరుగుతుందని పేర్కొన్నారు. హక్కుల హరించడానికి పాల్పడుతున్న బిజెపి మోడీ ప్రభుత్వాన్ని ప్రతిఘటించాలని కోరారు. మోడీ నియంతృత్వ దూకుడులను నివారించాలని రాజ్యాంగబద్ధ హక్కులు కోసం పేదలు పోరాడాలని అన్నారు. మత విభజనలకు విద్వేషాలకు తావివ్వకుండా ప్రజలు మధ్య ఐక్యత కోసం పోరాడాలని అన్నారు. గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. ఉపాధి కూలీలకు కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించాలని కోరారు.

బికెఎంయు జాతీయ మహాసభలు జయప్రదం చేయండి: జాతీయ కార్యవర్గ సభ్యులు టి వెంకట్ రాములు
భారత్ కేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ మహాసభలు నవంబర్ 2 నుండి 5 వరకు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరుగుతున్నాయని బికెఎంయు జాతీయ కార్యవర్గ సభ్యులు టి వెంకట్ రాములు పేర్కొన్నారు. నవంబర్ రెండవ తేదీన పాట్నాలో బహిరంగ సభ జరుగుతుందని బహిరంగ సభకు దేశ నలుమూల నుండి లక్షలాది మంది వ్యవసాయ కూలీలు పాల్గొంటున్నారని తెలంగాణ రాష్ట్రం నుండి కూడా వేలాది మందిని సమీకరించాలని తెలిపారు. బికెఎంయు రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య ప్రసంగిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వం చేర్పించి అక్టోబర్ 25 నాటికి రాష్ట్ర కేంద్రానికి అందించాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్లు సృజన్ కుమార్, బుద్దుల జంగయ్య, చింతకుంట్ల వెంకన్న, రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, శ్రావణ్ కుమార్, నరసింహ, శంకర్, మహిళా నాయకురాలు మహాలక్ష్మి స్వరూప, జనార్ధన్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News