Sunday, April 28, 2024

త్వరలో కొవిడ్ గోలీ

- Advertisement -
- Advertisement -

Covid Pill Shows Rapid Clearance Of Virus

జపాన్ కంపెనీ తయారీ

న్యూఢిల్లీ : సిరప్ , ఇంజిక్షన్ కాకుండా ఇప్పుడు కొవిడ్ నివారణ టాబ్లెటు చికిత్సకు రానుంది. జపాన్‌కు చెందిన షియోనోగి అండ్ కోలిమిటెడ్ కంపెనీ కొవిడ్ పిల్ విషయంలో పురోగతి సాధించింది. తాజాగా దీని ఫలితాలను తెలిపే లెక్కలను దీని పనితీరును వెలువరించింది. కొవిడ్ 19 సోకేలా చేసే వైరస్‌ను త్వరితగతిన శరీరంలో నుంచి దూరం చేసేలా ఈ పిల్‌ను రూపొందించారు. ఈ ట్యాబ్లెటుకు పిల్ ఎస్ 217622 అని పేరు పెట్టారు. కరోనాను సంక్రమింపచేసే సార్స్ కోవ్ 2 వైరస్ నుంచి ఈ గోళీ పూర్తిగా సత్వరంగా దూరం చేసి మనిషిని ఆరోగ్యవంతుడిని చేస్తుంది. ఈ విషయాలను తమ సుదీర్ఘ పరిశీలన క్రమంలో కనుగొన్నట్లు కంపెనీ ఆదివారంతమ ఫేజ్ 2బి ఫలితాలను ఉదాహరిస్తూ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తమ పిల్‌ను పంపిణీ చేయాలని ఈ కంపెనీ లక్షంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ పిల్ జపాన్ ఔషధ నియంత్రణ సంస్థల పరిశీలనలో ఉంది. ఇవి సానుకూలంగా వెలువడితే ఈ పిల్ మార్కెట్‌లోకి రావడానికి ఇప్పుడు సాగుతోన్న టీకాల స్థాయి కరోనా చికిత్సకు బదులుగా గోళీ వేసుకునే సాధారణ ప్రక్రియ వెలుగులోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తిపై గ్లోబల్ 3 ట్రయల్స్‌ను అమెరికా ప్రభుత్వం సాయంతో చేపడుతామని కంపెనీ ముఖ్య నిర్వాహణాధికారి ఐసావో టెషిరోగి తెలిపారు. ఏడాదికి కోటి పిల్స్ ఉత్పత్తి లక్షం పెట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News