Sunday, May 5, 2024

కేబుల్ బ్రిడ్జిపై పగుళ్లు..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: నగర శివారులో నిర్మించినటు వంటి కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించే విధంగా పనులు పూర్తి చేసిన ప్రారంభించి సంవత్సరం పూర్తికాకముందే పగుళ్లు ఏర్పడడం, కృంగిపోవడం, తారు రోడ్డు చెడిపోవడం, మానేరు రివర్ ఫ్రంట్ లో చెక్ డ్యాములు కొట్టుకపోవడం లాంటివి కళ్ళకు కట్టినట్లుగా కనబడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి కనబడడం లేదా అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. కరీంనగర్ లోని కేబుల్ బ్రిడ్జీని గురువారం సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ,సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి,సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ,ఈ. టి.నర్సింహా,జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామిలు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే బ్రిడ్జిలు కూలిపోక తప్పవని అన్నారు.

కెబుల్ బ్రిడ్జీ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని దానిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయాలని సదరు కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ డిమాండ్ చేశారు. కరీంనగర్లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని చూస్తుంటే పైన పటారం లోన లొటారం లాగా ఉందని పైపై మెరుగులతో నిర్మాణం చేపట్టి అందంగా సుందరీ కరణ చేసామని గొప్పలు చెప్పుకోవడం తద్వారా ఎన్నికల్లో లబ్ది పొందాలని అత్యుత్సాహంతో త్వరితగతిన పూర్తి చేసి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజలకు ఏదో మేము ఆహ్లాదకర వాతావరణం సృష్టించామని ప్రభుత్వం గొప్పలు చెప్పు కుంటుందని కేబుల్ బ్రిడ్జీనీ చూస్తుంటే కెసిఆర్, కెటిఆర్ తెల్ల జుట్టుకు నల్ల రంగు వేసుకున్నట్లు ఉందని అంత మాత్రాన దాని అసలు రంగు బయటపడక మానదని, ఈ సామెతకు ఉదాహరణంగానే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ఉందని, అందాల బ్రిడ్జి కాదు ఇది అడ్డగోలుగా దోచుకోవడానికి ఉన్నట్లుగా ఉంది ఈ బ్రిడ్జి అని నారాయణ పేర్కొన్నారు.

కేబుల్ బ్రిడ్జి అందంగా అలంకరణగా ఉన్నదనే ఉద్దేశంతోనే ఇక్కడికి ప్రజలు సందర్శన కోసం వస్తారని నాణ్యత ప్రమాణాలు దెబ్బతిని ప్రమాదవశాత్తు బ్రిడ్జి కూలిపోతే అనేకమంది ప్రాణాలు కోల్పోతారనే ఉద్దేశంతోనే జ్యూడిషియల్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు నారాయణ పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతా కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ లో భాగంగా సుందరీకరణ పేరుతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ కు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నటువంటి పనులు కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్,కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్,బండ రాజిరెడ్డి, ఏ.ఐ.ఎస్.ఎఫ్.రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి,

జిల్లా కౌన్సిల్ సభ్యులు బోయిని తిరుపతి, పైడిపెల్లి రాజు,కిన్నెర మల్లవ్వ,కటికరెడ్డి బుచ్చన్న యాదవ్,నలువాల సదానందం, బ్రామండ్ల పెల్లి యుగేందర్,బోనగిరి మహేందర్,మచ్చ రమేష్,కంది రవీందర్ రెడ్డి ,బూడిద సదాశివ రాజు,కనకం నరేష్,కాల్వ శ్రీనివాస్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News