Monday, April 29, 2024

సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -
CPM Central Committee meetings begin
రాజకీయ ముసాయిదాపై చర్చిస్తాం:  ఏచూరి

హైదరాబాద్: మూడు రోజుల పాటుకొనసాగే సిపిఐ కేంద్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపు మాజీ సిఎం మాణిక్ సర్కార్, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బివి రాఘవులు, బృందా కారత్‌తో పాటు మిగతా పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకర్లతో ఏచూరి మాట్లాడుతూ.. తమ పార్టీ అఖిల భారత మహాసభలను ఏప్రిల్‌లో కేరళలోని కన్నూర్‌లో నిర్వహించనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న కేంద్ర కమిటీ సమావేశాల్లో రాజకీయ ముసాయిదాపై చర్చిస్తామని చెప్పారు. అనంతరం ప్రజలకు విడుదల చేస్తామని తెలిపారు.

ఆ ముసాయిదాకు సంబంధించిన సూచనలు, సవరణలు, అభిప్రాయాలను తమ పార్టీ సభ్యులందరూ కేంద్ర కమిటీకి తెలపొచ్చని అన్నారు. ఇందుకోసం నెల రోజుల గడువునిస్తామని చెప్పారు. ఇది సిపిఎం అంతర్గత ప్రజాస్వామ్యమని వివరించారు. సవరణల అనంతరం అఖిల భారత మహాసభలో రాజకీయ నివేదికను ప్రవేశపెడతామని తెలిపారు. త్వరలో జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహంపై కూడా కేంద్ర కమిటీలో చర్చిస్తామని ఏచూరి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ మళయాళీ అసోసియేషన్, కేరళ సిఎం విజయన్‌తో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన సభ కోవిడ్ నిబంధనల దృష్టా రద్దయిందని తెలిపారు. అయితే ఇక్కడి కేరళవాసుల విజ్ఞప్తి మేరకు శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఆయన వర్చువల్ పద్ధతిలో ప్రసంగించనున్నారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News