- Advertisement -
హారర్ సినిమాలకు ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. భయపడుతున్నా.. సరే కళ్లు మూసుకుంటూ హారర్ సినిమాలు చూసే వాళ్లు చాలా మందే ఉంటారు. అలా హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్ల కోసం ఓటిటిలో త్వరలో ఓ సిరీస్ స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ‘అంధేరా’ (Andhera) అనే వెబ్‌సిరీస్ ఆగస్టు 14 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ సిరీస్‌లో ప్రియా బాపత్, కరణ్‌వీర్ మల్హోత్రా, ప్రజక్త కోలి, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌కి కథను గౌరవ్ దేశాయ్ అందించగా.. రాఘవ్ ధర్ దర్శకత్వం వహించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా ఈ సిరీస్ ప్రసారం కానుంది.
- Advertisement -