Friday, May 3, 2024

బెట్టింగ్ ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

Cricket betting gang arrested

రూ.2.21 కోట్ల విలువైన సామగ్రి స్వాధీనం

యాప్‌ల ద్వారా ఐపిఎల్ బెట్టింగ్
నిర్వహణ 23మంది బెట్టింగ్ రాయుళ్ల
అరెస్ట్, పరారీలో ప్రధాన నిందితుడు
వివరాలు వెల్లడించిన సైబరాబాద్
సిపి స్టీఫెన్ రవీంద్ర

మనతెలంగాణ, హైదరాబాద్ : ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌ల బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితులను మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన బూకీతో సహా ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. 23 మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.93,00,052 నగదు, 14 బెట్టింగ్ బోర్డులు, 8 ల్యాప్‌టాప్‌లు, 247 మొబైల్ ఫోన్లు, 28 స్మార్ట్ ఫోన్లు, నాలుగు ట్యాబ్‌లు, నాలుగు టివిలు, రెండు రౌటర్లు, ప్రింటర్, 5 కార్లు మొత్తం రూ.2,21,65,000 వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని విజయవాడకు చెందిన మహా, సిబిఆర్ అలియాస్ చెన్ను భాస్కర్‌రెడ్డి, గుంటూరుకు చెంది సురేష్ ప్రధాన బూకీలుగా పనిచేస్తున్నారు.

వీరి కింద సబ్ బూకీలుగా పవన్, సుమన్, రామాంజనేయులు, నందాలాల్ గోరి, చింత వేణు, వడువు అజయ్ కుమార్, జెల్ల సురేష్, కూనపరెడ్డి దుర్గా పవన్ కుమార్, తిరుమాణి మణికంఠ, కోలాటి మణికంఠ, శ్రీనివాస్, దుర్గాప్రసాద్ కొల్లాటి, సుందరరామరాజు అలియాస్ హరి, జయ శ్రీనివాస్, నాగళ్ల రాకేష్, జమ్ము నాగరాజు, తురెళ్ల సాయి, గొడావర్తి వెంకటేష్, అట్లూరి రంజిత్‌కుమార్, కొట సాయినవిన్, బొప్పా వెంకటేష్, గన్నీ కళ్యాణ్ కుమార్, పాతి పాటి రాము అలియాస్ అచ్యూత రామయ్య, ఈడార రవి, గన్నీ రవితేజ, కామగాని సతీష్, మల్లికార్జున చారీని పట్టుకున్నారు. నిందితులు గచ్చిబౌలి, మియాపూర్, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు ఏజెంట్లను నియమించుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

ఐపిఎల్‌కు బాగా ఆదరణ ఉండడంతో దానిని సొమ్ము చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. ఆసక్తి ఉన్న వారి వద్ద నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా బెట్టింగ్ డబ్బులు తీసుకుని బెట్టింగ్ కడుతున్నారు. ఫ్యాన్సీ లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్ లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్ 365, బెట్ ఫేయిర్ తదితర యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ యాప్‌లకు తెలంగాణలో ఎలాంటి అనుమతి లేదు. యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు తదితరులు బెట్టింగ్ కడుతున్నారు. ఎస్‌ఓటి డిసిపి సందీప్ ఆధ్వర్యంలో ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్సైలు, పిసిలు బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేశారు.

నాలుగు లేయర్లు…..

బెట్టింగ్ నిర్వహించే వారు నాలుగు లేయర్లుగా విభజించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో మొదటి లేయర్‌లో ప్రధాన నిర్వాహకుడు, రెండో లేయర్‌లో సబ్ బూకీ, మూడో లేయర్‌ను బూకీ, నాలుగో లేయర్‌లో పంటర్లు ఉంటారు. లేయర్లను బట్టి ఏజెంట్లకు కమీషన్ ఇస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News