Tuesday, May 14, 2024

ఐపిఎల్ నుంచి హాజిల్‌వుడ్ ఔట్..

- Advertisement -
- Advertisement -

CSK Pacer Hazlewood pulls out of IPL 2021

ముంబై: ఐపిఎల్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)కు షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాలతో తాను ఐపిఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు హాజిల్‌వుడ్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సిఎస్‌కె యాజమాన్యం ధ్రువీకరించింది. ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో హాజిల్‌వుడ్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎటువంటి బ్యాటింగ్ లైనప్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా అతని సొంతం. ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లోనూ హాజిల్‌వుడ్ అద్భుతంగా రాణించాడు. ఇదిలావుండగా ఐపిఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు అతను చేసిన ప్రకటన ధోనీ సేనను షాక్‌కు గురి చేసింది. ఈ సీజన్‌లో అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కొన్ని నెలలుగా ఎడతెరిపి లేకుండా క్రికెట్ ఆడుతున్నానని, దీంతో తనకు తగినంత విశ్రాంతి లేకుండా పోయిందన్నాడు. ఈ పరిస్థితుల్లో సుదీర్ఘ రోజుల పాటు సాగే ఐపిఎల్‌లో ఆడడం తనకు సాధ్యం కాదని, అందుకే టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు హాజిల్‌వుడ్ వెల్లడించాడు.

CSK Pacer Hazlewood pulls out of IPL 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News