Saturday, June 3, 2023

సియుఇటి పిజి షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పలు ప్రముఖ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సియుఇటి పిజి 2023) దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు సోమవారం(మార్చి 20) రాత్రి నుంచి ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని యుజిసి ఛైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ ట్విటర్‌లో వెల్లడించారు.

దరఖాస్తు రుసుంను డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్, యుపిఐ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని సూచించారు. ఈ పరీక్షకు అభ్యర్థుల అర్హత, పరీక్ష కేంద్రాలు, పరీక్ష ఫీజు, సమయం, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? తదితర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎప్పటికప్పుడు వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా 66 కేంద్రీయ, రాష్ట్రీయ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పిజి ప్రవేశాల కోసం గతేడాది ఎన్‌టిఎ నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 6.07 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

యుజిసి చైర్మన్ ట్వీట్ ప్రకారం ముఖ్య తేదీలివే..

దరఖాస్తుల స్వీకరణ: మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 సాయంత్రం 5 గంటల వరకు
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: ఏప్రిల్ 19న రాత్రి 11.50గంటల వరకు
దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు గడువు: ఏప్రిల్ 20 నుంచి 23వరకు
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష తేదీ తదితర అంశాలను తర్వాత ప్రకటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News