Saturday, April 27, 2024

కేంద్ర వర్సిటీల యుజి కోర్సులకు ఉమ్మడి పరీక్ష

- Advertisement -
- Advertisement -

Joint Examination for UG Courses of Central universities

వచ్చే జులై మొదటి వారంలో సియుఇటి నిర్వహణ

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2022 -23 విద్యాసంవత్సరంలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి కేంద్రీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష( సియుఇటి) నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్( యుజిసి) చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ తెలిపారు. జులై మొదటి వారంలో ఈ పరీక్ష ఉంటుందన్నారు. సోమవారం ఆయన వర్చువల్ విధానంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలియజేశారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులకు సిఇయుటి స్కోర్ తప్పనిసరని, ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తామని తెలిపారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్‌టిఎ)కు అప్పగించినట్లు తెలిపారు.

ఈ పరీక్షకు 12వ తరగతి ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలనుంచి సిలబస్ ఉంటుందని జగదీశ్ కుమార్ తెలిపారు.ఈ పరీక్షకు 12వ తరగతి మార్కుల వెయిటేజి ఉండబోదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీలు, డీమ్డ్ టు బి యూనివర్సిటీలు ఈ సియుఇటి స్కోరును ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అధిక కటాఫ్‌ల ఒత్తిడినుంచి విద్యార్థులకు సియుఇటితో ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు తల్లిదండ్రులు, విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గుతుంది. వర్సిటీకో ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ మేరకు ఆర్థిక భారం తగ్గుతుంది. అయితే సియుఇటిపై విద్యావేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్య ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News