న్యూఢిల్లీ: లండన్‌లోని హిత్రో, బెల్జియంలోని బ్రస్సెల్స్, జర్మనీలోని బెర్లిన్ సహా అనేక యూరొపియన్ విమానాశ్రయాలు సైబర్‌దాడికి గురయ్యాయి. దీంతో చెక్యిన్, బోర్డింగ్ వంటి విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సైబర్ నేరగాళ్లు సర్వీస్ ప్రొవైడర్లను లక్షంగా చేసుకోవడంతో ఈ సమస్య తలెత్తింది. దీని ఫలితంగా అనేక విమానాలు ఆలస్యం కావడమేకాక, పలు విమానాలు రద్దయినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇది యూరొపియన్ ఖండంలో వేలాది మంది ప్రయాణికులపై ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, విమానాశ్రయాల కోసం ప్రభావిత సిస్టమ్స్‌ను సరిచేసే కాలిన్స్ ఏరోస్పేస్, దాడికి సంబంధించిన సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. వెళ్లే ప్రయాణికులు ఆలస్యం జరిగే అవకాశం ఉన్న విషయాన్ని గ్రహించాలని హిత్రూ విమానాశ్రయం తెలిపింది. అంతేకాక విమాన స్టేటస్‌ను తెలుసుకోవాలని కోరింది.
ఐరోపా విమానాశ్రయాలపై సైబర్ దాడి
- Advertisement -
- Advertisement -
- Advertisement -