Saturday, May 4, 2024

గుకేశ్ దొమ్మరాజు నయా చరిత్ర

- Advertisement -
- Advertisement -

ఫిడె క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత చెస్ ఆటగాడు గ్రాండ్ మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్ కైవసం చేసుకొన్న రెండో భారత గ్రాండ్ మాస్టర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో విశ్వనాథన్ ఆనంద్ ఈ టైటిల్‌ను గెలుచుకుని ఈ ఘనతను సాధించాడు. కెనెడాలోని టొరంటోలో జరిగిన ఈ టోర్నిలో ఫైనల్లో ఆమెరికా చెందిన హికారు నకామురాతో తలపడిన గుకేశ్ రెండు గేమ్‌లలోనే ముగిసింది. వారిద్దరి మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది. రష్యాకు చెందిన ఇయాన్ నెపోమ్నియాచ్చి- ఫ్యాబియానో కరువనా మధ్య జరిగిన మరో గేమ్ కూడా డ్రాగా ముగిసింది. అప్పటికే గుకేష్ తొమ్మిది పాయింట్లతో ముందంజలో ఉండటంతో అతన్ని విజేతగా ప్రకటించింది ఫిడె. ఇందులో గెలవాలంటే 14 పాయింట్లను సాధించాల్సి ఉండగా ఏ గ్రాండ్ మాస్టర్ అన్ని పాయింట్లు సాధించలేక పోయారు.

ఫైనల్ రౌండ్‌కు చేరిన నలుగురి ఆటగాళ్లలో అత్యధికంగా తొమ్మిది పాయింట్లతో గుకేష్ మొదటి స్థానంలో నిలవడంతో విజేతగా ప్రకటించారు. ఇక ఈ విజయంతో గుకేశ్‌కు వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో ఆడే అవకాశం లభించిందతనికి. ఈ టోర్నమెంట్‌లో చైనాకు చెందిన వరల్డ్ ఛెస్ ఛాంపియన్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లైరెన్‌తో తలపడనున్నాడు. గ ఏడాది హాంగ్ఝౌలో జరిగిన ఆసియా క్రీడల్లో గుకేష్ రజత పతకం సాధించాడు. కాగా, ఫిడె క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2024ను గెలిచిన గుకేష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, విశ్వనాథన్ ఆనంద్, వ్లాదిమిర్ క్రామ్నిక్, కోనేరు హంపి, డేవిడ్ హావెల్, తాన్యా సచ్‌దేవ్, హాన్స్ నీమన్, దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర వంటి ప్రముఖులు గుకేష్‌ను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News